వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా వదిన భువనేశ్వరి మంచిది, టిఆర్ఎస్‌కే ఓటేస్తానని చెప్పారు: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చంద్రబాబు, మరికొంత కుట్రలు చేసి వచ్చిన తెలంగాణను అడ్డుకున్నారని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగానూ మరోటి చేయాలని ఇదే చంద్రబాబు నాయుడు అన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు చెప్పారు. ఎపిలో పనిచేసుకోవాలని తాను చంద్రబాబుకు నిన్ననే చెప్పానని ఆయన గుర్తు చేశారు.

వదల బొమ్మాలి వదలను అని చంద్రబాబు అంటారని, ఎవరైనా పొమ్మంటున్నారా, హెరిటేజ్ దుకాణాలు పెట్టుకో, లైసెన్సులు ఇప్పిస్తా, మా భువనేశ్వరి, నీకన్నా ఆమె నయమని, చంద్రబాబు విజయవాడ పోయాడని, వదిన భువనేశ్వరి చాలా మంచిదని, ఆమె ఇక్కడే ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. మనవాళ్లు వెళ్లి అడిగితే హైదారాబాదులో మీకే ఓటిస్తేనని భువనేశ్వరి చెప్పారని అన్నారు.

అమరావతికి వచ్చి ఇక్కడే ఉంటా అని నేనంటే ఒప్పుకుంటారా, ముంబై వెళ్లి ఉంటానని అంటే అంగీకరిస్తానని అన్నారు. హైదరాబాదు నుంచి పరిపాలన చేయాలంటే విదేశాల నుంచి పరిపాలన చేసినట్లు ఉందని అంటారని ఆయన చంద్రబాబును దుయ్యబట్టారు. మాయమాటలు మానుకో అని చంద్రబాబుకు సూచించారు. తిరిగి తెలుసుకున్నాడు కాబట్టి మున్సిపల్ శాఖను తన కుమారుడు కెటిఆర్‌కు ఇస్తానని చెప్పారు. బల్దియాపై గులాబీ జెండా ఎగిరిందని ఆయన అన్నారు.

KCR

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను గుంజుకున్నది చంద్రబాబు, గుంజించినవాడు వెంకయ్యనాయుడు అని ఆయన అన్నారు. హైదరాబాదుకు నీళ్లు కావాలని, గోదావరి నుంచీ నాగార్జునసాగర్ నుంచి నీళ్లు వస్తున్నాయని అన్నారు. చంద్రబాబు తన ముద్ర ఉందని అంటారు, కాంగ్రెసు మేమే చేశామంటారని, నిజాం కట్టిన రిజర్వాయర్లు హైదరాబాదుకు ఉన్నాయా, మనం కట్టుకుంటామని ఆయన అన్నారు. మోరీలన్నీ కబ్జా పెట్టారని ఆయన అన్నారు. వర్షం వస్తే హైదరాబాదులోని అన్ని దారుల్లో నీళ్లు నిలుస్తాయని, ఇది చంద్రబాబు ముద్ర అని అన్నారు.

చంద్రబాబు హైదరాబాదును అభివృద్ధి చేశానని అంటారని, ఈ నీళ్లేమిటని బయటి నుంచి వచ్చిన ఓ మిత్రుడు అన్నారని, దానికి మాకు ప్రత్యేక కార్లున్నాయని, మా కార్లన్నీ బోట్లవుతాయని చెప్పానని అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్

తెలంగాణ కోసం పనిచేయాలని తనకు చెప్పారని పనిలేక కాదు, చంద్రబాబును ఎపిలో పనిచేయాలని చెప్పారని, చంద్రబాబుకు ఎపిలో పని ఉందని, హిందూపురం నుంచి ఇచ్చాపురం దాకా చాలా బజార్లు ఉన్నాయి ఊడ్చుకో అని, మా బజార్లు మేమే ఊడ్చుకుంటామని చెప్పానని ఆయన అన్నారు. చంద్రబాబు చక్కిలిగింతలు పెట్టి హైదరాబాదును కలకలం చేయాలని చూస్తున్నారని కెసిఆర్ అన్నారు. చంద్రబాబు మాటలతో పోతే ఇబ్బంది పడుతామని ఆయన అన్నారు.

టిఆర్ఎస్ కనుక హైదరాబాదులో గెలిస్తే చెవి కోసుకుంటానని సిపిఐ నారాయణ అంటున్నారని, ఇది వరకు కూడా ఏదేదో అన్నారని, తొడ కోసుకుంటా... మెడ కోసుకుంటా అని వరంగల్‌లో ముఠా చెప్పిందని, అక్కడ డిపాజిట్లు దక్కకుండా చేస్తే వచ్చి పడ్డారని, అదే ముఠా హైదరాబాదు వచ్చి మాట్లాడుతున్నారని, ఎవరెవరు ఏదేది కోసుకుంటారో తయారుగా ఉండాలని అన్నారు.

చంద్రబాబు చేతిలో ఏముందని, ఇక్కడ ఏమీ చేయలేడని ఆయన అన్నారు. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నది టిఆర్ఎస్ పార్టీ అని, బల్దియాలో టిఆర్ఎస్ గెలిస్తే అందరూ చెట్టాపట్టాల్ వేసుకుని పనిచేస్తే హైదరాబాదును అభివృద్ధిని చేసుకోగలమని ఆయన అన్నారు. చంద్రబాబు, ఏడేంద్లు కాంగ్రెసు పాలించిన నాయకులు మనకు ఏడు మార్కెట్లు ఇచ్చారని, అవి ఎలా సరిపోతాయని ఆయన అన్నారు. హైదరాబాద్ పేదరికానికి, హైదరాబాదు గుడిసెలకు ఎవరు జవాబుదారీ ఎవరని ఆయన అన్నారు. మూసీనదిని కంపులుగా, హుస్సేన్ సాగర్‌ను కాలుష్య కాసారంగా చేసింది కాంగ్రెసు, టిడిపిలు కావా అని అడిగారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోనే కెసిఆర్ డబుల్ బెడ్రూంలు కడుతున్నాడని దత్తాత్రేయ చెబుతున్నారని, ఆ పథకం తెలంగాణలో తప్ప మరో రాష్ట్రంలో ఉందా అడుగుతున్నానని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో డబుల్ బెడ్రూం పథకం ఉందా ప్రజలకు చెప్పాలని ఆయన దత్తాత్రేయను డిమాండ్ చేశారు.

చంద్రబాబుతో దత్తాత్రేయ తిరిగారని, ఎపిలో డబుల్ బెడ్రూం పథకం ఉందా అని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో డబుల్ బెడ్రూంలు కట్టిస్తామని చెప్పామని, అవాకులూ చెవాకులు చెప్పారని ఆయన అన్నారు. హైదరాబాదుపై ప్రేమ ఉందని, విజయవాడ నుంచి వస్తానని చంద్రబాబు చెప్పారని, బషీర్ బాగ్‌లో నలుగురు రైతులను చంపిన రక్తం ముద్ర, అంగన్‌వాడీ కార్యకర్తలను కొట్టిచ్చిన ముద్ర చంద్రబాబుకు ఉందని ఆయన అన్నారు. కాంట్రాక్టు పద్ధతి ద్వారా శ్రమదోపిడీ చేశాడని చంద్రబాబును ఆయన దుయ్యబట్టారు.

తెలంగాణ వస్తే అంధకారం అలుముకుంటుందని కిరణ్ కుమార్ రెడ్డి కట్టె పట్టుకుని చెప్పారని, వారు చెప్పినవన్నీ తప్పులని తేలాయని ఆయన అన్నారు. పరిశ్రమలకు కూడా కోత లేకుండా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి కెసిఆర్ వివరించారు.

చాలా కష్టపడి సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, తెలంగాణ రాష్ట్రానికి గుండె కాయలాంటి హైదరాబాదుకు ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన న్నారు. హైదరాబాద్ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని, రాజకీయ పార్టీల హోరులో కొట్టుకుపోకుండా బల్దియా ఎన్నికల్లో పాల్గొనాలని ఆయన అన్నారు.

2004లో యుపిఎ తన ఎజెండాలో పెట్టిందని, హైదరాబాద్ మీద రాజీ పడుతారా తెలంగాణ తొందరగా ఇస్తామని కాంగ్రెసువారు చెప్పారని, హైదరాబాద్ మీద కొద్దిగా రాజీపడితే 2007లోనే తెలంగాణ వచ్చేదని, హైదరాబాద్ గుండెకాయ అని, గుండెకాయ లేని మొండికాయ తీసుకోవడానికి సిద్ధంగా లేమని సోనియా గాంధీకి చెప్పానని అన్నారు.

అందుకే హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తీసుకోవడానికి పద్నాలుగున్నర ఏళ్లు పట్టిందని ఆయన అన్నారు. 14ఎఫ్ తెస్తే తాను ఆమరణ దీక్షకు దిగానని, తెలంగాణ అంతటా పోరాటాలు జరిగాయని, కాంగ్రెసు దిగి వచ్చి తెలంగాణ ఇస్తామని అన్నారని ఆయన అన్నారు.

English summary
Telangana CM and Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao addressed the Hyderabad voters from Secendurabad parade grounds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X