ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ గొడవలకు వైయస్సే కారణం: కెసిఆర్ సంచలన వ్యాఖ్య (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

అదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్రాష్ట్ర వివాదానికి వైయస్ రాజశేఖర రెడ్డియే కారణమని ఆరోపించారు.

కాంగ్రెస్ నేతలు తమ హయాంలో రూ.4వేల కోట్లు జేబులో వేసుకున్నారని ధ్వజమెత్తారు. నకిలీ ప్రాజెక్టులు కట్టారని, ఇక మీదట అలాంటివి ఉండవని చెప్పారు.

కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు కడితే కాల్వలు లేవని, కాల్వలు ఉంటే ప్రాజెక్టులు లేవన్నారు. కెసిఆర్ బతికి ఉన్నంత వరకు అటువంటి నకిలీ ప్రాజెక్టులు ఉండవన్నారు. ప్రాణహిత - చేవెళ్ల విషయంలో వైయస్ కొంపముంచారన్నారు. అంతర్రాష్ట్ర వివాదాన్ని సృష్టించారన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి మూడు నియోజకవర్గాలకు సాగునీరు ఇస్తామని, దీనిపై ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

అదిలాబాద్ జిల్లాలోని సమస్యలన్నీ తనకు తెలుసునని, వచ్చే ఐదారేండ్లలో ప్రాజెక్టులు పూర్తిచేసి ఇంచు భూమి కూడా వదలకుండా సాగునీరు అందించే బాధ్యత తనదేనన్నారు. మోసపూరిత ప్రాజెక్టులు మాత్రం కట్టబోమని ఆయన స్పష్టం చేశారు.

కెసిఆర్

కెసిఆర్


మేం డూప్లికేట్ ప్రాజెక్టులు కట్టమని, గతంలో ప్రాజెక్టులు అంటే కేవలం కమీషన్ల కోసం కట్టారని, తాము ప్రజల కోసం పని చేస్తున్నామని, ప్రజలకు పనికి వచ్చేవే కడతామని కెసిఆర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాను అందాల కాశ్మీరంలా ప్రముఖ పర్యాటక కేంద్రంగా తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఆదిలాబాద్‌లో త్వరలో విమానాశ్రయం కూడా వస్తుందని ప్రకటించారు. అరుపులు, పెడబొబ్బలు వదిలి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. అడవులను కాపాడాలని కోరారు.

కెసిఆర్

కెసిఆర్

ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దండేపల్లి మండలం గూడెంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. కడెం మండలం దేవునిగూడెంలో ఒకేచోట లక్ష మొక్కలు పెంచే కార్యక్రమంలో పాల్గొన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లాలో 12 ఇంచుల వర్షపాతం నమోదవుతున్నదని, అనేక వాగులు, వంకలు ఉన్నాయని అన్నారు. అయినా గత కాంగ్రెస్, తెలుగుదేశం పాలకుల వైఫల్యం వల్ల జిల్లాలో కరువు చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కెసిఆర్

కెసిఆర్

ఉమ్మడి పాలకులు మన వద్ద పేరుకే ప్రాజెక్టులు ప్రారంభం చేసి నీళ్లు ఆంధ్రా ప్రాంతానికి తరలించుకున్నారన్నారు. ప్రాజెక్టులు ఉంటే కాలువలు లేవు.. కాలువలు కడితే ప్రాజెక్టులు లేవన్నారు. అసలు వారి ఉద్దేశం తెలంగాణకు నీళ్లు ఇవ్వకుండా అడ్డుకోవడమేనన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

అంతర్రాష్ట్ర వివాదాలు సృష్టించే విధంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ చేశారని, ఈ ప్రాజెక్టు కింద మహారాష్ట్రలో భూములు మునుగుతాయన్నారు. దీనితో ప్రాజెక్టు కట్టవద్దని, దానికోసం వెచ్చించే డబ్బులు వృథా అవుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో చెప్పిందన్నారు. తాను మహారాష్ట్ర వెళ్లినప్పుడు అక్కడి ప్రభుత్వం మీరు కావలిసిన నీళ్లు తీసుకువెళ్లండి, అభ్యంతరం లేదు కానీ, మా భూములు మాత్రం మునగకుండా చూడమని చెప్పిందన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

ప్రాణహిత చేవెళ్ల మీద కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిద్వారా గత ప్రభుత్వం జిల్లాకు 56వేలఎకరాలకు నీరందించాలని ప్రతిపాదించారన్నారు. అయితే తాము లక్షా 50వేల ఎకరాలకు నీరందించాలని ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టుకు మహారాష్ట్ర అభ్యంతరం తదితరాల నేపథ్యంలో దీనిపై కసరత్తు చేశామన్నారు. సాధ్యమైనంత మేర ముంపు తగ్గించడం, ఎక్కువ ఎకరాలకు నీరందించడం లక్ష్యమన్నారు.

కెసిఆర్

కెసిఆర్


తుమ్మిడిహట్టి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి నీటిని ఆదిలాబాద్ జిల్లాకు తరలిస్తామని ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఆయకట్టుకు నీళ్లందుతాయన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

అదే సమయంలో కాళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి ఆ నీటిని మిగతా జిల్లాలకు తరలిస్తామని చెప్పారు. ఎవరు కూడా అరుపులు, పెడబొబ్బలు పెట్టాల్సిన అవసరం లేదని, ఈ జిల్లాలో సమస్యలు తనకు తెలుసునన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

వట్టివాగు వట్టిపోయి 10ఎకరాలకు నీరు పారే పరిస్థితి లేదని, చాలా ప్రాజెక్టులు అడ్డగోలుగా కట్టారని, కట్టిన ప్రాజెక్టులు చక్కగా చేసుకుందామని, సదర్‌మాట్ ఇంకా ఉన్న దాని కంటే పెద్దగా చేసే అవకాశం ఉందని, తప్పకుండా చేసుకుందామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ ఏర్పడితే లాభం పొందే మొట్టమొదటి జిల్లా ఆదిలాబాదేనని తాను ముందే చెప్పానన్నారు. ఇక్కడ నీటిని సద్వినియోగం చేసుకుంటే జిల్లాకు వాడుకోగా మిగతా జిల్లాలకు కూడా సరఫరా చేయవచ్చన్నారు. జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు తెచ్చుకునే అవకాశం ఉందన్నారు

కెసిఆర్

కెసిఆర్

అడవులను కాపాడే బాధ్యత నాదని, అభివృద్ధి బాధ్యత నాదని కెసిఆర్ అన్నారు. దేవునిగూడెంలో ఒకేచోట లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఏం చేయాలో ఇక్కడి చేసి చూపారన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ ఎలా పచ్చగా ఉండాలని నేను కోరుకుంటున్నానో అదే విధంగా ఇక్కడి ప్రజలు కూడా కోరుకుంటున్నారనడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదన్నారు.

English summary
KCR in Adilabad vows to complete water projects, blames YSR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X