నేనూ తట్టమోస్తా: చిన్నముల్కనూరును దత్తత తీసుకున్న కెసిఆర్(పిక్చర్స్)

కరీంనగర్: అందరి కృషితో గ్రామాల్లో అద్భుతాలు సృష్టించొచ్చని, పాడుబడిన గ్రామాన్ని బంగారం చేద్దామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. శనివారం జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటించారు. తాను దత్తత తీసుకున్న చిన్నముల్కనూర్ గ్రామాన్ని కూడా ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్లతోపాటు ఉమ్మపూర్ పరిధిలోని మహాసముద్రం గండిని పరిశీలించారు. అనంతరం అటవీ ప్రాంతమైన మహాసముద్రం గండి వద్దే నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ.. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడొద్దన్నారు. దేశ విదేశాల్లో తమ అభివృద్ధిని చాటిచెబుతున్న అంకాపూర్, గంగదేవిపల్లి గ్రామాలను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేసేందుకు సన్నద్ధం అవుదామన్నారు.

చెత్తను తొలగించేందుకు ఇంటికొకరు నడుం బిగించాలని, ప్రత్యేక కార్యాచరణతో యువత ముందుకు రావాలన్నారు. గ్రామ శుభ్రతకు శ్రీకారం చుట్టేందుకు 12న మళ్లీ వస్తానన్నారు. తనవంతుగా 50తట్టల మోసి, పల్లెవాసులతో సంహపంక్తికి కూర్చుంటానన్నారు. గ్రామాభివృద్ధికి ఇప్పటికే 50లక్షల నిధులు విడుదల చేయగా, తమవంతుగా ఎంపీ 25లక్షలు, ఎమ్మెల్యే 15లక్షలు, కలెక్టర్ 25 లక్షల నిధులు అందించేందుకు ముందుకు వచ్చారన్నారు.

ఏడాదిన్నరలో గ్రామానికి తాగు, సాగు నీరు అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. గ్రామంలో రహదారుల విస్తరణ, పాడుబడిన ఇళ్ళ కూల్చివేత, పాతబావులు పూడ్చివేత, ఊరచెరువు అభివృద్ధి, చెరువుకట్ట పటిష్టం తదితర పనులు మొదటి ప్రాధాన్యతలో పూర్తి చేసేందుకు కార్యచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఇళ్ళులేని 200మంది గ్రామస్థులకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. వీటికి ఆగస్టు 12నే శంకుస్థాపన చేస్తామన్నారు.ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే ఒడితెల సతీశ్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూప్రసాద్, ఎమ్మెల్యేలు సత్యనారాయణ, రసమయి బాలకిషన్, దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధు, కే విద్యాసాగర్‌రావు, ఇతర జిల్లాలనుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పాల్గొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఆరు నూరైనా రెండు, రెండుంబావు ఏండ్లలో తెలంగాణలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, తలకాయ తెగిపడినా ఆడినమాట తప్పేదిలేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు.

అవ్వతో ముచ్చటిస్తున్న కెసిఆర్

అవ్వతో ముచ్చటిస్తున్న కెసిఆర్

ఏది ఏమైనా బీళ్లకు నీళ్లు పారాలని అన్నారు. తప్పుడు ప్రాజెక్టులకు రూపకల్పనచేసిన నాయకులు ఇప్పుడు వాటిని సరిచేద్దామంటే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. కావాలనే బురద జల్లుతున్నారు అని మండిపడ్డారు.

కెసిఆర్ కాన్వాయ్

కెసిఆర్ కాన్వాయ్

గత పాలకులు ప్రాజెక్టులు కడితే ఇప్పుడు చేళ్లు ఎండిపోయేవా? అని ఆయన నిలదీశారు. ప్రాణ హిత-చేవెళ్ల ఓ తప్పుడు ప్రాజెక్టు అని కేసీఆర్ చెప్పారు. పనికిరాని ప్రాజెక్టులను ఎవరికోసం ప్రారంభించారో అందరికీ తెలుసని అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తాము ఎవరికీ తలొగ్గేది లేదన్న సీఎం.. ప్రజలే తమ బాసులని, వారి ప్రయోజనాలకోసమే ప్రభుత్వం పనిచేస్తుందని ఉద్ఘాటించారు.

కెసిఆర్

కెసిఆర్

శనివారం కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్లతోపాటు ఉమ్మపూర్ పరిధిలోని మహాసముద్రం గండిని పరిశీలించారు.

ప్రజలు

ప్రజలు

అనంతరం అటవీ ప్రాంతమైన మహాసముద్రం గండి వద్దే నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు.

కెసిఆర్

కెసిఆర్

ఆ తర్వాత ఇదే నియోజకవర్గం పరిధిలో తాను దత్తత తీసుకున్న చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామసభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

గ్రామంలోని ప్రతి గల్లీ తిరిగి సమస్యలు పరిశీలించారు. మహాసముద్రం గండివద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.

కార్మికుల నినాదాలు

కార్మికుల నినాదాలు

తెలంగాణ వచ్చి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఈ రాష్ర్టాన్ని 45 ఏళ్లు కాంగ్రెస్, 15 ఏండ్లు టీడీపీ పాలించాయని, ఒక్కనాడు తెలంగాణ ప్రాజెక్టుల గురించి ఈ పార్టీలు ఆలోచించలేదన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఇప్పుడు పంటలు చూస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నయన్నారు. ఆనాడే ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణలోని పంటలకు ఈ పరిస్థితి వచ్చేదా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

సభకు హాజరైన మహిళలు

సభకు హాజరైన మహిళలు

60 ఏళ్లు రాజ్యం చేసిన ఈ పార్టీలు ఆరు కసికల నీళ్లు కూడా తేలేక పోయారని మండిపడ్డారు.

కెసిఆర్

కెసిఆర్

హుస్నాబాద్ ప్రాంతానికి కావల్సిన సాగునీటిని మధ్య మానేరునుంచి తేవాలంటే వీటి సామర్థ్యం ఏ మాత్రం సరిపోదన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ కరువు ప్రాంతంలో 1.50 లక్షల ఎకరాలు పారాలంటే 1.50 టీఎంసీల నీరు సరిపోతుందా? ఒక ప్రాజెక్టు సామర్థ్యం 1.50 టీఎసీలలైతే మరో ప్రాజెక్టు 150 ఎంసీఎఫ్‌టీలు డిజైన్‌చేశారు అంటూ గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి వివరించారు.

కెసిఆర్

కెసిఆర్

గండిపెల్లి చిన్న కుంటలా ఉందని, మోచేతికి బెల్లంరాసి నాలుకతో తినమన్నట్లుగా ప్రాజెక్టుల రూపకల్పన జరిగిందని అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేయలేదని సీఎం చెప్పారు. తోటపల్లి రిజర్వాయర్‌ను నేనో, స్థానిక ఎమ్మెల్యేనో, మంత్రో రద్దు చేయలేదని, రద్దు మంచిదని ఇంజినీర్లు పరిశీలిస్తున్నారు. వారు చెప్పింది ఎంతవరకు నిజమో పరిశీలించేందుకే వచ్చానని తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

మిడ్‌మానేరునుంచి హుస్నాబాద్ నియోజకవర్గంలోని 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలంటే ఇపుడున్న ప్రాజెక్టులు, కాలువల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ముంపు బాధితులకు కూడా తగిన పరిహారం ఇవ్వాల్సి ఉందని చెప్పారు.

ప్రజలు

ప్రజలు

మహాసముద్రం గండి అద్భుతంగా ఉందని చెప్పారు. వ్యవసాయానికి ఉపయోగపడే ఊట చెరువుగా మార్చితే పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దుకోవచ్చని సిఎం కెసిఆర్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+