వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రాన్ని నిలదీయండి - కలిసొచ్చే పార్టీలతో ముందుకు : పార్లమెంట్ వేదికగా- ఎంపీలతో సీఎం కేసీఆర్..!!

|
Google Oneindia TeluguNews

ఇక కేంద్రం పైన పోరాటం తీవ్రతరం చేయాలని పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేసారు. ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. రెండో రోజు నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు విపక్ష పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేంద్రం అమలు చేయలేదని..వీటి పైన నిలదీయాలని నిర్దేశించారు. తెలంగాణ రాష్ట అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని పార్లమెంట్ వేదికగా ప్రస్తావించాలని స్పష్టం చేసారు.

కేంద్ర ధోరణిని నిలదీయాలి

కేంద్ర ధోరణిని నిలదీయాలి


కేంద్రం రాష్ట్రాలతో ఇష్టానుసారం వ్యవహరిస్తోందని.. కేంద్రం తీసుకున్న నిర్ణయాల పైన నోటీసులు ఇచ్చి చర్చకు పట్టుబట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర చూపిస్తున్న పక్షపాత ధోరణిపైన నిలదీయాలని సూచించారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనలను పరిమితి విషయంలో కేంద్రం మాట మార్చి..రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతున్న అంశం పైన పార్లమెంట్ లో ప్రస్తావించాని సీఎం నిర్దేశించారు. ఎనిమిదేళ్ల కాలంగా తెలంగాణ చెల్లింపుల్లో ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాకుండా చెల్లించిన రికార్డు ఉందని ఎంపీలకు వివరించారు.

తెలంగాణకు అన్యాయం జరుగుతోంది

తెలంగాణకు అన్యాయం జరుగుతోంది


రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల మొత్తం ఎంత.. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన వాటా ఎంతో లెక్కలను ఎంపీలకు అందించారు. దీని పైన ప్రశ్నించాలని సీఎం సూచించారు. ఎన్డీయే హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో...జాతీయ స్థాయిలో కలసి వచ్చే పార్టీలతో కలిసి పార్లమెంట్ లో ప్రస్తావించాలని ఎంపీలకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని స్పష్టం చేసారు.

విపక్షాలతో సమన్వయం చేసుకోండి

విపక్షాలతో సమన్వయం చేసుకోండి


ఎన్డీయే వ్యతిరేక రాజకీయ పక్షాలతో కలసి పార్లమెంట్ లో అంశాలను లెవనేత్థడంపై సమన్వయం చేసుకోవాలని ఎంపీలకు సూచించిన కేసీఆర్ ..పార్లెమెంటరీ పార్టీ నేతలు - విప్ లు ఇందులో భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం పైన అనుసరించాల్సిన వ్యూహం పైన జాతీయ పార్టీలకు చెందిన విపక్ష నేతలతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని నిలదీసేందుకు కలిసి కట్టుగా ముందడుగు వేయాలని నిర్ణయించారు. దీంతో..గతం కంటే భిన్నంగా ఈ సారి పార్లమెంట్ సమావేశాలు మరింత హాట్ గా సాగే అవకాశం కనిపిస్తో

English summary
CM KCR directed the Party MP's the strategy to follow against the Union government in Parliament against the injustice meted out to Telangana in all sectors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X