కెసిఆర్, చంద్రబాబు కలిసి మాట్లాడుకోవాలి: దత్తాత్రేయ సూచన
నిజామాబాద్: నిధులు, నియామకాల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడు కలిసి చర్చించుకోవాలని కేంద్రమంత్రి దత్తాత్రేయసూచించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాక్షించారు. కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల అభవృద్ధి సహకరిస్తుందన్నారు.
నిజామాబాద్‌లోని 10 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కార్మికులకు కనీస వేతనాలు అమలయ్యేలా చూస్తామని దత్తాత్రేయ హామీ ఇచ్చారు. దేశంలోని అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.

దేశంలో 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. వీరందరికి త్వరలోనే స్మార్ట్‌కార్డులు అందిస్తామని చెప్పారు. సెప్టెంబర్ తొలి వారంలో స్మార్ట్‌కార్డులను ప్రవేశపెట్టాలని అనుకుంటున్నామని చెప్పారు. ప్రతి కార్మికుడికి యూఏఎన్(యూనివర్సల్ అకౌంట్ నెంబర్) నెంబర్‌ను యాక్టివేట్ చేస్తామన్నారు.
యూఏఎన్ ద్వారా ప్రతీ నెల నేరుగా కార్మికుడి అకౌంట్లోకి పీఎఫ్ డబ్బులు వెళ్లేలా చేస్తామన్నారు. నవంబర్ నెల చివరల్లో బీడీ కార్మికులకు యూఏఎన్ నెంబర్ ఇస్తామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు కూడా యూఏఎన్ నెంబర్ ఇచ్చి పీఎఫ్‌ను వారి అకౌంట్లలో జమ చేస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications