రైతుల ఓటుబ్యాంకు కోసం కేసీఆర్ బిగ్ ప్లాన్: రైతులకు పెన్షన్ పథకం?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికలలో ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రైతులను ఆకట్టుకోవడానికి సీఎం కేసీఆర్ (cm kcr) రైతులకు పెన్షన్ (pensions to farmers) పథకం అమలు చేయబోతున్నారని చర్చ జరుగుతుంది.

వచ్చే ఎన్నికలలో రైతుల, రైతు కుటుంబాల ఓటు బ్యాంకు కోసం సీఎం కేసీఆర్ రైతులకు పెన్షన్ పథకాన్ని (farmer pension scheme) ప్రవేశ పెట్టబోతున్నారని బిఎస్ వర్గాలు చెబుతున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ సాధ్యాసాధ్యాలపై వర్కౌట్ చేస్తున్నారని కూడా సమాచారం. రైతుల కోసం ఇప్పటికే రైతుబంధు పథకాన్ని వర్తింపజేస్తున్న సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీని విడతల వారీగా అమలు చేస్తున్నారు.

 KCR

వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కేసీఆర్ మూడవసారి అధికారం కోసం సంచలన నిర్ణయం తీసుకుంటారని ఆసక్తికర చర్చ జరుగుతుంది. రైతులను ఆకట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ (congress rythu declaration) ను ప్రకటించి హామీల వర్షం కురిపిస్తుంది. మరోవైపు రైతు ఓటు బ్యాంకు కోసం బిజెపి తమ వంతు ప్రయత్నాలు చేస్తుంది.

అయితే కాంగ్రెస్, బీజేపీలకు చెక్ పెట్టి రైతులను తమ వైపుకు తిప్పుకునే ఆలోచనలో ఉన్న కేసీఆర్ రైతులకు పెన్షన్ ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నారని సమాచారం. రాష్ట్రంలో రైతు కుటుంబాల ఓట్లు సుమారు కోటికి పైగానే ఉంటాయని, ఈ ఓటు బ్యాంకును తమ ఖాతాలో వేసుకోవాలంటే కచ్చితంగా రైతులను ఆకట్టుకునే పథకాన్ని వాళ్లకు అందించాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ మేరకు కసరత్తు ప్రారంభించిన ఆయన వచ్చే నెల 16వ తేదీన వరంగల్లో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభలో రైతుల పెన్షన్ పథకాన్ని ప్రకటించాలని ఆలోచనలో ఉన్నారని టాక్. ఏది ఏమైనా ప్రస్తుతం ఆసక్తికర చర్చగా మారిన రైతుల పెన్షన్ పథకం కెసిఆర్ తీసుకొస్తారా? లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+