గులాబీమయమైన ఖమ్మం; 5లక్షల మందితో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ; దారులన్నీ ఖమ్మం వైపే!!
ఖమ్మంలో నేడు బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. ఖమ్మం నగరం అంతా గులాబీమయంగా మారింది. ఖమ్మం వేదికగా జాతీయ రాజకీయాలలో భారత రాష్ట్ర సమితి బలమైన పునాదులను వెయ్యాలని భావిస్తుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖమ్మం సభకు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు సభా ప్రాంగణానికి తరలి వెళుతున్నారు.

గులాబీమయంగా మారిన ఖమ్మం ..
ఇక ఖమ్మం నగరంలో ఎటు చూసినా హోర్డింగులు, కటౌట్లు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు ఘన స్వాగతం పలుకుతూ ఖమ్మం నగరం ముస్తాబయింది. ఖమ్మం నగరంలోని వంద ఎకరాల విస్తీర్ణం ఉన్న స్థలంలో, జర్మనీ టెక్నాలజీతో వాటర్, ఫైర్ ప్రూఫ్ సభా వేదికను ఏర్పాటు చేశారు. సుమారు 5 లక్షల మందికి సరిపోయే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. మొదట ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం, కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేత లబ్ధిదారులకు కళ్ళజోడులను పంపిణీ చేస్తారు.

బీఆర్ఎస్ సత్తా చాటేలా భారీ జన సమీకరణ
తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ తో పాటు మరో ముగ్గురు ముఖ్యమంత్రులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన జాతీయ నేతలు ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లతో కేసీఆర్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. సభలో నేడు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు, దానిని నడిపే శక్తి బీఆర్ఎస్ కుఉందనే సంకేతాలను ఈ సభ ద్వారా కేసీఆర్ ఇచ్చే అవకాశముందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఏపీ, చత్తీస్ గడ్ ల నుండి కూడా భారీగా కేసీఆర్ సభకు
అంతేకాదు ఈ సభా వేదికగా పలు కీలక నిర్ణయాలను, పార్టీ అజెండాను వెల్లడించనున్నారు. బీఆర్ఎస్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకుల చేరికలు, పార్టీల విలీనానికి సంబంధించిన ప్రకటన కూడా ఇక్కడ చేస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సత్తా చాటేలా భారీ జన సమీకరణ చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి, చత్తీస్ గడ్ రాష్ట్రం నుండి కూడా భారీగా జనాలు తరలి వస్తున్నారు. ఇక కేసీఆర్ సభ దేశం దద్దరిల్లేలా జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం సభకు పోలీసుల భారీ బందోబస్తు
అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ నిర్వహిస్తున్న బహిరంగ సభ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ చెప్పారు. ఖమ్మంలో ట్రాఫిక్ సమస్య రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఖమ్మం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
-
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications