జైట్లీ కూతురు వివాహ విందులో ఎదురుపడిన బాబు-కెసిఆర్: ఇద్దరూ బిజీ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి కలుసుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూతురు సోనాలి విందులో వారిద్దరు ఎదురుబడ్డారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు మాట్లాడుకున్నారు.

విభజన అనంతరం తెలంగాణలో కెసిఆర్, ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య రాజకీయ రగడ ప్రారంభమైంది. ఆ తర్వాత అమరావతి శంకుస్థాపన.. ఇరువురిని కలిపింది.

KCR and Chandrababu attend Arun Jaitley's daughter dinner

ఢిల్లీలో జైట్లీ కూతురు సోనాలి విందులో కలుసుకుని మాట్లాడిన అనంతరం ఇరువురు సీఎంలు ఎవరి దారిన వారు వెళ్లారు. కెసిఆర్ తన నివాసానికి వెళ్లారు. చంద్రబాబు కేంద్రమంత్రి మహేష్ శర్మను కలుసుకున్నారు. ఇరువురు సీఎంలు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు.

కెసిఆర్ మంగళవారం ఢిల్లీకి చేరుకోగా, చంద్రబాబు బుధవారం చేరుకున్నారు. కాగా, వీరిద్దరు వరుసగా కేంద్రమంత్రులను కలవనున్నారు. విభజన సమస్యల పైన చర్చిస్తారు. కేంద్రమంత్రులతో వారు వరుసగా భేటీ అవుతూ బిజీగా గడపనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+