పన్ను పెంచితే తప్ప ఉద్యోగుల జీతాలు పెంచలేం!: సీఎం కెసిఆర్
హైదరాబాద్: ఆస్తి పన్ను పెంచితే తప్ప మున్సిపల్ ఉద్యోగుల జీతాలు పెంచలేమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ కార్మికుల సమ్మె పైన అధికారులు ప్రభుత్వానికి నివేదికను పంపించారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. ఆస్తి పన్ను పెంచితే తప్ప ఉద్యోగుల జీతాలు పెంచలేమని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
2006 నుంచి మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను పెంచలేదని, నివేదిక పైన అధ్యయనం చేయాలని కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

కాళేశ్వరంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న హరీశ్ రావు
కాళేశ్వరంలోని స్నానఘట్టాలను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. పుష్కరాలు ముగిసే వరకు పటిష్ట బందోబస్తు చర్యలు ఉంటాయన్నారు. అన్ని ఘాట్ల వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారన్నారు.
కాళేశ్వరం పుష్కర ఘాట్‌కు వచ్చే వాహనాలను వన్ వేలోనే అనుమతించామన్నారు. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో చేస్తున్నారు. బుధవారం నాడు ఆరు లక్షలమంది దర్శనం చేసుకున్నారని, పుష్కరాలకు వచ్చే వాహనాల కోసం 40 ఎకరాల్లో ఫార్కింగ్ స్థలం ఏర్పాటు చేశామన్నారు.












Click it and Unblock the Notifications