వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో'.. నవంబర్29, దీక్షా దివస్: గుర్తుచేసుకున్న కవిత!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు. ఉద్యమాన్ని మలుపు తిప్పిన చారిత్రాత్మకమైన రోజు నవంబర్ 29. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కెసిఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన దీక్షాదివస్ నేడు. ప్రజలలో తెలంగాణ ఆకాంక్షను రేకెత్తించేలా, అందరిలో ఒకసారి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయాన్నిపురికొల్పేలా చేసిన సీఎం కేసీఆర్ నేడు నవంబర్ 29వ తేదీనే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. నేటికి సీఎం కేసీఆర్ చేపట్టిన దీక్షకు 13 సంవత్సరాలు పూర్తయ్యాయి.

నేడే దీక్షా దివస్... ఆమరణ దీక్షతో చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తొలి దశ ఉద్యమంలో ఎంతో మంది మహనీయులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. అయితే ప్రజలలో బాగా చైతన్యాన్ని తీసుకురాలేకపోయారు. ప్రభుత్వం మెడలు వంచేలా ఉద్యమించలేకపోయారు. కానీ 2009లో మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న రోజుల్లో సీఎం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఒక్కసారిగా ప్రతి ఒక్కరినీ కదిలించింది. నవంబర్ 29 2009 వ సంవత్సరంలో కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మొక్కవోని దీక్షతో ప్రాణాలను పణంగా పెట్టి, చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించారు.

తెలంగాణా వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదంతో దీక్షకు దిగిన కేసీఆర్


నీళ్లు, నిధులు, నియామకాల కోసం నాడు సాగించిన పోరాటంలో తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అన్న నినాదంతో ఆయన ఆమరణ దీక్ష చేయాలని తీసుకున్న దృఢసంకల్పానికి నవంబర్ 29న బీజం పడింది. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తర్వాత 11 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష సాగించిన కెసిఆర్ తన దీక్షను విరమించారు. కెసిఆర్ సాగించిన ఆమరణ నిరాహార దీక్ష ప్రజలలో రాష్ట్ర సాధన ఆకాంక్షను మరింత బలోపేతం చేసి సబ్బండ వర్ణాలు ఉద్యమించేలా చేసింది. సకల జనుల సమ్మెతో తెలంగాణ రాష్ట్రం మారుమోగిపోయింది.

తెలంగాణా వస్తే జైత్ర యాత్ర .. లేకుంటే నా శవ యాత్ర సాగుతుందన్న కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ నాటి అనేక రాజకీయ కారణాల వల్ల, సిద్దిపేట నుండి దీక్షను ప్రారంభించదలచినా తన దీక్షకు అనేక ఇబ్బందులను కలిగించినప్పటికీ, అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించిన అప్పటికీ అక్కడ కూడా ఆయన తన దీక్షను కొనసాగించారు. తెలంగాణ వస్తే జైత్రయాత్ర సాగుతుందని లేకుంటే నా శవ యాత్ర సాగుతుందని పలికిన కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష లో ఆరోగ్యం క్షీణించినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయాన్ని కొనసాగించారు. దీక్ష విరమించాలని ఎంతమంది విజ్ఞప్తి చేసిన ససేమిరా అన్న కేసీఆర్ ఆరోగ్యం విషమంగా మారగా, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చే వరకు కెసిఆర్ తన దీక్షను కొనసాగించారు.

దీక్షా దివస్ ను స్మరించుకుంటున్న ఉద్యమకారులు.. కవిత ట్వీట్

తెలంగాణ ఉద్యమంలో చరిత్ర లిఖించిన దీక్షా దివస్ ను నేడు తెలంగాణ ఉద్యమకారులంతా స్మరించుకున్నారు. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్న ప్రతి ఒక్కరూ నేడు ఆ ఉద్యమ ఫలాలపై చర్చించుకుంటున్నారు. నేడు దీక్షా దివస్ సందర్భంగా కెసిఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా నాడు సాగించిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. నేడు తెలంగాణా సాధించిన ప్రగతిని చెప్పుకొచ్చారు.

అభివృద్ధి ఫలాలతో సబ్బండ వర్ణాలు సగర్వంగా,సంతోషంగా ఉన్నారన్న కవిత

అభివృద్ధి ఫలాలతో సబ్బండ వర్ణాలు సగర్వంగా,సంతోషంగా ఉన్నారన్న కవిత

కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు,'తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో' అంటూ, ప్రాణాలను పణంగా పెట్టి, సమైక్య పాలకుల నిర్బంధాలను ఛేదించి, ‌సిద్దిపేట కేంద్రంగా ఉద్యమ వీరుడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన చారిత్రక రోజు...నవంబర్ 29, దీక్షా దివస్ అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. నాడు ఉద్యమ సమయంలో కెసిఆర్ ఫోటోలను పోస్ట్ చేసి, ప్రాణాలను పణంగా పెడితేనే తెలంగాణ వచ్చిందంటూ పేర్కొన్నారు. ఆనాటి ఆమరణ నిరాహారదీక్ష స్పూర్తితో, స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ గారి సారధ్యంలో, సర్కారు సంక్షేమ, అభివృద్ధి ఫలాలతో సబ్బండ వర్ణాలు సగర్వంగా,సంతోషంగా ఉన్నారని కవిత తెలిపారు. రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా నిలుస్తూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

తెలంగాణాకు కేంద్రం షాక్.. దారి మళ్లించిన నిధులను రెండు రోజుల్లో చెల్లించాలని నోటీసులు!!తెలంగాణాకు కేంద్రం షాక్.. దారి మళ్లించిన నిధులను రెండు రోజుల్లో చెల్లించాలని నోటీసులు!!

English summary
November 29, 2009 KCR went on a death hunger strike for separate Telangana state. It turned the history of Telangana. remmbering the telangana movement MLC Kavitha tweeted on twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X