వాస్తేనా?: 29 రోజుల తర్వాత సచివాలయంలో కాలు పెట్టిన కెసిఆర్
హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సచివాలయంలో కాలు పెట్టారు.బుధవారం సచివాలయానికి వచ్చిన ఆయన దాదాపు గంటన్నరసేపు గడిపి వెళ్లిపోయారు. గత నెల 23వ తేదీ తర్వాత ఆయన సచివాలయంపై కూడా చూడలేదు.
సరిగ్గా 29 రోజుల విరామం అనంతరం సచివాలయానికి వచ్చివెళ్లారు. పొరుగు రాష్ట్రం తమిళనాడు సీఎం జయలలిత సుదీర్ఘకాలం సచివాలయానికి దూరంగా ఉండటంపై అక్కడ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా 29 రోజులు సచివాలయానికి దూరంగా ఉండటంపై కూడా చర్చ ప్రారంభమైంది.

బుధవారం కూడా ముందుగా నిర్ణయించిన కార్యక్రమానికి హాజరయ్యేందుకే ఆయన సచివాలయానికి వచ్చారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడిన అనంతరం ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు ఏవీ చూడకుండానే వెళ్లిపోయారు. ఆయన అధికారిక కార్యక్రమాలన్నీ క్యాంపు కార్యాలయం నుంచే నిర్వహిస్తున్నారు.
సచివాలయాన్ని వేరే చోటికి మార్చాలనే ఉద్దేశంతో కెసిఆర్ ఉన్నారు. ఛాతీ ఆస్పత్రిని తరలించి అక్కడ సచివాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన భావించారు. ప్రస్తుత సచివాలయం వాస్తు సరిగా లేదనే అభిప్రాయంతో కెసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. దానికారణంగానే ఆయన సచివాలయానికి దూరంగా ఉంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications