వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుతింటోంది: రెండోరోజు ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్

|
Google Oneindia TeluguNews

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి, బిజెపిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహిస్తున్న బండి సంజయ్ రెండవ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర ను కొనసాగించనున్నారు.

రెండోరోజు బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర.. 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర

బిజెపి ప్రజా సంగ్రామ యాత్ర నేడు జోగులాంబ గద్వాల జిల్లా ఇమాం పూర్ నుంచి ఆలంపూర్ లోని ప్రొగటూరు వరకూ కొనసాగనుంది. లింగనవాయి, బూడిదపాడు, ఉండవెల్లి ,తక్కశిల ప్రొగటూరు మీదుగా 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించనున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఉత్సాహంగా సాగుతుంది. బిజెపి నాయకులు, కార్యకర్తలతో బండి సంజయ్ గ్రామగ్రామాన పర్యటిస్తూ అక్కడి ప్రజలతో మాటామంతీ నిర్వహిస్తున్నారు.

కేసీఆర్ సర్కార్ పై మండిపడిన బండి సంజయ్


శుక్రవారం ఆలంపూర్ మండలం లింగనవాయి గ్రామంలోని గ్రామస్తులతో మాట్లాడిన బండి సంజయ్ సీఎం కేసీఆర్ అబద్ధాలాడి గద్దెనెక్కారు అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచుతూ పేదల నడ్డి విరిచే విధంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో మంది అమరుల త్యాగం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకుంటే కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా దోచుకుతింటోంది అని బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పేదవాడు పేదవాడి గానే ఉండేలా, ఉన్నోడు కోట్లు సంపాదించేలా సీఎం కేసీఆర్ పాలన ఉందని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

దళితులు బికార్లు కావాలన్నదే కేసీఆర్ లక్ష్యం: బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం రావాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. దళితులను సీఎం చేస్తా అని మాయమాటలు చెప్పి చేయలేదని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఇవ్వలేదని,దళితులు కోటీశ్వరులు అయితే నా మాట వినరు అని కేసీఆర్ భావించారని దళితులుబికార్లు కావాలనేదే కేసీఆర్ లక్ష్యం అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. అభివృద్ధి పథకాలకు అన్నీ కేంద్రమే నిధులిస్తుంటే నేను సొంతంగా నిధులు కేటాయిస్తున్నాను అని కేసీఆర్ అబద్ధాలు పలుకుతున్నారని బండి సంజయ్ విమర్శించారు.

కేసీఆర్ ఇంట్లో 5 పదవులైతే ..పేదోళ్లకు ఒక్క ఉద్యోగం ఎందుకు లేదు?

కేసీఆర్ ఇంట్లో 5 పదవులైతే ..పేదోళ్లకు ఒక్క ఉద్యోగం ఎందుకు లేదు? అని ప్రశ్నించిన బండి సంజయ్ రాష్ట్రంలో పేదోళ్లు బతుకొద్దనా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఐటీ మంత్రి, కేసీఆర్ కూతురు కవిత ఎమ్మెల్సీ, ఒక అల్లుడు సంతోష్ రాజ్యసభ సభ్యుడు, ఇంకో అల్లుడు హరీష్ రావు మరో మంత్రి.. ఇలా కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలున్నాయని, మరి మన పరిస్థితి ఏంటని, నిరుద్యోగ యువత పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలని బండి సంజయ్ పేర్కొన్నారు .

ఎన్నికల సమయంలో వచ్చే గులాబీ నేతలు ఓట్ల కోసం అబద్ధాలు చెప్తారు

ఎన్నికల సమయంలో వచ్చే గులాబీ నేతలు ఓట్ల కోసం అబద్ధాలు చెప్తారు


రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి వచ్చే నిధులన్నీ కేంద్రం పైసలే అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అబద్ధాలు చెప్పేందుకే టిఆర్ఎస్ నేతలు వస్తారని విమర్శించారు. కానీ మేం అలా కాదు.. రెండేళ్ళ ముందుగా వచ్చి మేం ఏం చెప్పామో కమలం గుర్తుకు మీరు ఓటు వేస్తే అవి అమలు చేస్తాం అని బండి సంజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నెల రోజుల పాటు 386 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర టీఆర్‌ఎస్ తప్పుడు వాగ్దానాలను, ప్రజల అభిప్రాయాన్ని సేకరించడంతోపాటు కేసీఆర్ దుష్పరిపాలనను బట్టబయలు చేస్తుందని పేర్కొన్నారు.

English summary
during the second day of the Prajasangramayatra BJP state president Bandi Sanjay targeted the KCR family for allegedly robbing the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X