మున్సిపల్ ఎన్నికల గ్రౌండ్ రిపోర్ట్ బయట పెట్టిన కేసీఆర్..!!

తెలంగాణలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ విదేశీ పర్యటన ముగించుకుని వస్తున్నారు. వరుసగా జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. అటు బీజేపీ జిల్లాల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరైన మాజీ సీఎం కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల పైనా ఫోకస్ చేసారు. పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేస్తూ.. క్షేత్ర స్థాయి అంచనాలను వెల్లడించారు.

మున్సిపల్ ఎన్నికల పై మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. క్షేత్ర స్థాయిలో పబ్లిక్ పల్స్ ఎలా ఉందో వివరించారు. సిట్ విచారణకు హాజరైన కేసీఆర్ ఆ తరువాత పార్టీ నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ కు మున్సిపాల్టీల్లో పరిస్థితి పూర్తిగా అనుకూలంగా ఉందని.. మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. అదే సమయంలో రెబల్స్ సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు.

KCR fixed responsibilities for the key leaders over municipal Elections Campaign and poll strategies

ప్రత్యేకంగా ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పార్టీ మరింత బలం పెంచుకుందని వివరించారు. పార్టీలో చేరే వారి సంఖ్య పెరిగిందని చెప్పుకొచ్చారు. అందరూ కలిసి కట్టుగా పని చేస్తూ.. రెబల్స్ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ స్పష్టం చేసారు. మున్సిపాల్టీల వారీగా అభ్యర్ధుల ఖరారు.. ప్రచార బాధ్యతల గురించి ఆరా తీసారు. సమస్యలు ఉన్న చోట ముఖ్య నేతలు మకాం వేసి.. పరిస్థితి సరిదిద్దాలని మాజీ మంత్రులను కేసీఆర్ ఆదేశించారు.

క్షేత్ర స్థాయిలో పరిస్థితులు.. నివేదిక

పార్టీ ముఖ్య నేతలు కలిసి కట్టుగా పని చేయటం ద్వారా ఖచ్చితంగా సానుకూల ఫలితాలు వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్ర స్థాయి నేతలు పార్టీ కార్యాలయంలో అందుబాటు లో ఉంటూ.. జిల్లాల నుంచి వచ్చే నేతలు ప్రస్తావించే సమస్యలకు పరిష్కారం చూపించాలని సూచించారు. నామినేషన్ల ఉప సంహరణ సమయంలోగా రెబల్స్ సమస్య పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకోవాలని నిర్దేశించారు. ప్రభుత్వం పైన ప్రజల్లో సానుకూలత లేదని.. పార్టీ నేతలు ఎక్కడికి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు సిద్దం చేసుకోవాలని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నివేదికలు వెల్లడించిన అంశాలను ప్రస్తావించారు. పూర్తిగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని... సమన్వయంతో పని చేస్తే అధిక సీట్లు గెలుచుకోవటం సులభమేనని వివరించారు. పోటీకి అవకాశం దక్కని వారికి భవిష్యత్ లో ప్రాధాన్యత ఉంటుందనే సందేశం ఇవ్వాలని సూచించారు. ప్రచారం గురించి కేసీఆర్ కీలక సూచనలు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+