మీ చిట్టా నా దగ్గరుంది.. ఆ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్!!

సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేస్తున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్, మళ్ళీ రిపీట్ అయితే సహించేది లేదన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారి మద్దతు బి ఆర్ ఎస్ కు ఉండేలా ప్రజాక్షేత్రంలో పనిచేయాలని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు హితబోధ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేసి మళ్లీ బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెబుతున్నారు. ఇక ఈ ప్రయత్నంలో తప్పులు చేసిన వారిని ఎవరిని క్షమించేది లేదని కెసిఆర్ హెచ్చరిస్తున్నారు.

వారిని సహించను: తేల్చి చెప్పిన కేసీఆర్

వారిని సహించను: తేల్చి చెప్పిన కేసీఆర్


తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి కొనసాగుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికలను గురించి అనేక కీలక విషయాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పిన కేసీఆర్ డిసెంబర్లోనే ఎన్నికలకు వెళతామని ముందస్తు సమస్య లేదని తేల్చి చెప్పారు. ఇక ఇదే సమయంలో ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, నియోజకవర్గాలలో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడంతోపాటు, ప్రజల మద్దతును పొందాలని ఆయన తెలిపారు. అంతేకాదు కొంతమంది తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కెసిఆర్ తేల్చి చెప్పారు.

వరంగల్, ఆదిలాబాద్ నేతలకు కేసీఆర్ సీరియస్ వార్నింగ్ .. ఎందుకంటే

వరంగల్, ఆదిలాబాద్ నేతలకు కేసీఆర్ సీరియస్ వార్నింగ్ .. ఎందుకంటే


ఇక కేసీఆర్ చెప్పిన లిస్టులో వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన నాయకులు ఉన్నట్టుగా పేర్కొన్నారు. దళిత బంధు స్కీం కింద కొంతమంది ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్నట్టు తన దగ్గర సమాచారం ఉందని కేసీఆర్ తెలిపారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నట్టు తన దగ్గర సమాచారం ఉందని పేర్కొన్న సీఎం కేసీఆర్ మళ్లీ అది రిపీట్ అయితే సహించేది లేదని తేల్చి చెప్పారు. 99% సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తానని కెసిఆర్, తేడా వస్తే కీలక నిర్ణయం తీసుకుంటాను అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

ప్రభుత్వ పథకాల పేరుతో లంచాలు తీసుకుంటే సహించేది లేదు

ప్రభుత్వ పథకాల పేరుతో లంచాలు తీసుకుంటే సహించేది లేదు


ఎమ్మెల్యేలు తప్పులు చెయ్యొద్దని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల పేరుతో లంచాలు తీసుకుంటే సహించేది లేదని తేల్చి చెప్పారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని పేర్కొన్నారు. మీ చిట్టా నా దగ్గర ఉందని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలతో ముందుకు సాగుతున్న వేళ బీఆర్ఎస్ నేతలు కూడా పాదయాత్రలకు సిద్ధం కావాలని, సమావేశాలు ప్లాన్ చేసుకోవాలని అక్టోబర్ నాటికి అన్ని పనులు పూర్తిచేసుకుని ఎన్నికలకు రెడీ అవ్వాలని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలలో లంచాలు తీసుకుంటున్న నేతలెవరు?


ఇక సీఎం కేసీఆర్ తాజా హెచ్చరికలతో ఆయా జిల్లాలలో నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దళిత బంధు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను దుర్వినియోగం చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరు? వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అన్నది? ఆసక్తికరంగా మారింది. ఇక గులాబీ బాస్ ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై డేటా తెప్పించుకుంటున్నారన్న చర్చ కూడా నేతల్లో కొనసాగుతుంది. మొత్తానికి ఓరుగల్లు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+