షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్ .. ఆ నోటీసులు చెల్లవని ఏసీపీకి లేఖ
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తు ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలైన హరీష్ రావు, కేటీఆర్ లను విచారణ జరిపింది. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు కూడా విచారణ కోసం నోటీసులు ఇవ్వడంతో కెసిఆర్ విచారణకు హాజరు అవుతారా లేదా అన్న దానిపైన సందిగ్ధతకు చెక్ పెడుతూ ఆయన విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు.
సిట్ అధికారులకు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్
ఇదే సమయంలో సిట్ అధికారులకు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా జూబ్లీహిల్స్ ఏసీబీకి లేఖ రాసిన ఆయన సిట్ జారీ చేసిన విచారణ నోటీసు చట్టప్రకారం లేదని, అది తన గౌరవానికి భంగం కలిగించిందని ఆరోపించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నంది నగర్ లోని నివాసంలో సిట్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ లేఖ రాసిన ఆయన నంది నగర్ లో నోటీసులను అంటించడం చెల్లదన్నారు.

నోటీసులు ఇచ్చే పరిధి ఏసీపీకి లేదని లేఖ
160 crpc ప్రకారం తనకు నోటీసులు ఇచ్చే పరిధి ఏసిపికి లేదని ఆయన స్పష్టం చేశారు. కెసిఆర్ తన వాంగ్మూలాన్ని తాను ఉండే ఎర్రవల్లిలో రికార్డు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సిట్ విచారణకు తాను సహకరిస్తానని, ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు తాను అందుబాటులో ఉంటానని కెసిఆర్ పేర్కొన్నారు.
నంది నగర్ లోనే కేసీఆర్ విచారణ
కెసిఆర్ లేఖతో నోటీసు చట్టబద్ధత పైన ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీంతో అధికారులు తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోవాలని దానిపైన సమావేశమైనట్టు సమాచారం. అయితే కెసిఆర్ కోరినట్టు ఎర్రవల్లి ఫామ్హౌస్ లో ఆయనను విచారించడానికి భద్రత దృష్ట్యా వీలుకాదని, నంది నగర్ లోనే విచారించాలని సిట్ నిర్ణయించింది.
కేసీఆర్ విచారణ నేపధ్యంలో ఉత్కంఠ
మరోవైపు రేపు కేసీఆర్ విచారణ వీడియో రికార్డింగ్ చేయనున్నారని సమాచారం. రేపు విచారణలో కేసులో ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయి అన్నది ఆసక్తిగా మారింది. ఇక ఈ క్రమంలో రేపు కేసీఆర్ ను విచారించనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications