ప్రభుత్వ స్కూల్స్‌కు మహర్దశ: విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ బంగారు కానుక

హైదరాబాదు: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలపై కేసీఆర్ సర్కార్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే 1000 ప్రభుత్వ పాఠశాలలకు మరమత్తులు చేయడంతో ఆ స్కూళ్లు కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. ఇక ఈ విద్యా సంవత్సరం (2023-24)నుంచే ఈ పాఠశాలల్లో విద్యార్థులు చదివేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఈ పాఠశాలలను మన ఊరు - మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం కింద మరమత్తులు చేసి మౌళిక సదుపాయాలు, ఇతరత్ర సదుపాయాలను మెరుగుపర్చింది ప్రభుత్వం. ఇప్పటికే ఈ కార్యక్రమం కింద 700 పాఠశాలలకు మరమత్తులు చేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించింది కేసీఆర్ సర్కార్. తాజాగా మరో 1000 పాఠశాలలను జూన్ 2వ తేదీ అయిన తెలంగాణ దినోత్సవం రోజున ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పాఠశాలలు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఉంటాయి. అంతేకాదు ఇక్కడ బోధన, మౌళిక వసతులు కూడా ప్రైవేట్ స్కూళ్లతో పోటీపడేలా ఉన్నాయి.

KCR govt revitalizing Education: Over 1,000 Upgraded Government Schools Ready for Grand Opening

అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం 26,072 ప్రభుత్వ పాఠశాలలను 12 అంశాల కింద దశలవారీగా మరమత్తులు చేసి టాప్ స్కూల్స్‌గా మార్చాలని భావించింది. ఇందులో భాగంగా తొలిదశ కింద 9123 పాఠశాలలను ఎంపిక చేసి దీని మరమత్తుల కోసం రూ.3,497.62 కోట్ల ఖర్చును అంచనా వేసింది. టాయ్‌లెట్స్ ఏర్పాటు, విద్యుత్, తాగునీరు, ఫర్నీచర్, స్కూళ్లకు రంగులు, గ్రీన్ బోర్డులు,కొత్త క్లాస్‌రూమ్స్,డైనింగ్ హాల్స్‌ ఏర్పాటు లేదా మరమత్తులు చేయనుంది కేసీఆర్ ప్రభుత్వం.

ఇదిలా ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ అందించాలన్న యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.ఈ క్రమంలోనే హైస్కూళ్లలో 13,983 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇవి మినీ కంప్యూటర్లలా పనిచేస్తాయి. ఇక బ్లాక్‌బోర్డు టీచింతో పాటు ఆడియో-వీడియో కంటెంట్ ద్వారా కూడా పిల్లలకు పాఠాలు బోధిస్తారు.

స్కూళ్లకు 20వేల టాబ్లెట్ పీసీలను కూడా అందజేసింది ప్రభుత్వం.ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ టాబ్లెట్‌లలో టీచర్లు మరియు విద్యార్థుల హాజరును ట్రాక్ చేస్తారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారనేదానిపై కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది.తెలంగాణలో 1521 పాఠశాలల్లో సోలార్ ఫోటోవాల్టిక్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది.టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌తో జతకట్టిన తెలంగాణ ప్రభుత్వం.. డిజిటల్ టీచింగ్ పై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా 2వేల పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబులను ఏర్పాటు చేయడం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+