రెచ్చగొట్టొద్దు: కెసిఆర్‌కు డీకే అరుణ, సహకరిస్తాం కానీ: కోదండరాం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు డికె అరుణ, మల్లు భట్టి విక్రమార్కలు ఆదివారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని డీకే అరుణ భగ్గుమన్నారు.

మా కుటుంబంలో చిచ్చుపెట్టావ్, బిచ్చమెత్తుకుంటా: కెసిఆర్‌పై అరుణ

పాలమూరు ప్రాజెక్టు పైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. సెంటిమెంటును రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ను అంటే సహించం: జగన్‌కు తలసాని, వెళ్లి సీఎంకు చెప్తా: డీకే అరుణ

తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు ఎలాంటి లాభాలు పొందారో త్వరలో బయటపెడతామని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. తెరాస దోపిడీపై మంత్రులు సమాధానం చెప్పాల్సిన అవసరముందని, సంక్షేమం అనే దానికి అర్థం లేకుండా చేస్తున్నారన్నారు.

KCR have no commitment towards Palamuru, says DK Aruna

గాంధీ కుటుంబంతో పోల్చుకునే అర్హత తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబానికి లేదన్నారు. తెరాస నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. డబుల్ బెడ్ రూం పథకం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.

సమన్యాయం జరగాలి: కోదండరాం

జలసాధనకు తెలంగాణ జేఏసీ సహకరిస్తుందని జేఐసీ చైర్మన్ కోదండరామ్ ఆదివారం అన్నారు. సమష్టి కృషితో తెలంగాణకు ప్రాజెక్టులు వచ్చాయని చెప్పారు. పాలమూరుకు సాగునీరు ఇవ్వకుంటే ఆ ప్రాంతం ఎడారి అవుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెంది, సమన్యాయం జరగాలన్నారు.

మొక్కలు నాటిన రాజీవ్‌ త్రివేది

మెదక్‌ జిల్లా సంగారెడ్డి కంది జిల్లా జైలు ఆవరణలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌ త్రివేదీ మొక్కలు నాటారు.

బాబు ఆశయాలకు భిన్నంగా రేవంత్ రెడ్డి దోస్తీ: కారణాలివే!

హరిత హారంలో భాగంగా ఆయన హైదరాబాద్‌ నుంచి కంది వరకూ సైకిల్‌ యాత్ర నిర్వహించారు. మొక్కలు నాటిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అంతకముందు ఎస్పీ గెస్ట్ హౌస్‌ ఆవరణలో మొక్కలు నాటారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
KCR have no commitment towards Palamuru, says DK Aruna.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి