రాజన్నను దర్శించుకున్న కెసిఆర్, ఫ్యామిలీ: బ్యూటీఫుల్ అంటూ కవిత ట్వీట్
కరీంనగర్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబసమేతంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కుటుంబానికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
తూర్పుద్వారం నుంచి రాజన్న ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబసమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అయుత చండీ మహాయాగాన్ని ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన సీఎం కేసీఆర్ వేద పండితుల సూచన మేరకు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు.సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి ఈటల రాజేందర్ తదితరులు ఉన్నారు.
ఇది ఇలా ఉండగా, వేములవాడ వెళుతుండగా కనిపించిన పొద్దుతిరుగుడు పూల తోటను చూసిన ఎంపి కల్వకుంట్ల కవిత వాటిని కెమెరాలో బంధించారు. ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోలను పోస్టు చేసి.. బ్యూటీఫుల్ సన్‌ఫ్లవర్స్ అని వ్యాఖ్యానించారు.
The way to vemulavada is full of sunflower fields .. Beautiful !! pic.twitter.com/ThxTZiArjD
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 28, 2015 











Click it and Unblock the Notifications