తుమ్మల, పొంగులేటిపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఖమ్మం: ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలని అన్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా పాలేరులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పూటకో పార్టీ మారే వారిని నమ్మొద్దన్నారు.
తుమ్మల ఓడిపోయి మూలకు కూర్చుంటే.. పిలిచి మంత్రిని చేశాను అని కేసీఆర్ తెలిపారు. ఎమ్మెల్యే చేసి ఐదేళ్లు ఖమ్మం జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే.. ఒక్క సీటు రాకుండా చేశారని తుమ్మలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. మిత్రుడు తుమ్మల నాగేశ్వర్ రావుకు తాను అన్యాయం చేశానని ఆయన ప్రచారం చేస్తుండు. ఆయన ఖమ్మంలో పువ్వాడ అజయ్‌పై ఓడిపోయాడు. ఓడిపోవడంతో ఇంట్లకు పోయి మూలన కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత స్నేహితం ఉందని, సీనియర్ నాయకులని చెప్పి ఆయనను తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీని చేశాను అని కేసీఆర్ చెప్పారు.

'ఆ తర్వాత పాలేరులో ఎమ్మెల్యే వెంకట్ రెడ్డి చనిపోయారు. ఆయన భార్యను పోటీలో పెట్టాలని అనుకున్నాం. కానీ, తుమ్మల వచ్చి అన్న నా నియోజకవర్గం రిజర్వ్ అయింది. అవకాశం ఇస్తే పాలేరు సేవకు చేస్తా, కాపాడుకుంటాను అని చెప్తే ఉప ఎన్నికల్లో టికెట్ ఇచ్చి మేమంతా వచ్చి దండం పెడితే 42 వేల మెజార్టీతో గెలిపించారు. ఈ సత్యం మీకు తెలుసు. ఓట్లు వేసింది మీరే' అని కేసీఆర్ చెప్పారు.
ఖమ్మం జిల్లాలో ఎవరు ఎవరికి ద్రోహం చేశారో ప్రజలకు తెలుసు.. వాళ్లకు ప్రజలే తగిన బుద్ది చెబుతారు : పాలేరు సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్.#KCROnceAgain #VoteForCar pic.twitter.com/ZiGlZuFZbC
— BRS Party (@BRSparty) October 27, 2023
'నేను ఒక్కటే మాట అడుగుతున్నాను. మంత్రిని చేసి, ఎమ్మెల్సీని చేసి, ఎమ్మెల్యేను చేసి ఐదేళ్లు జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే నీవు చేసింది సున్నా గుండు సున్నా. ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు రాకుండా చేశారు. ఎవరు ద్రోహం చేశారు. ఎవరికి ఎవరు నష్టం చేశారు. బీఆర్ఎస్‌కు తుమ్మల అన్యాయం చేసిండా..? బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా..?' అని కేసీఆర్ ప్రశ్నించారు. 'ఇవాళ నోరు ఉందని అడ్డగోలుగా మాట్లాడితే రాజకీయం కాదు. ప్రజాస్వామ్యం కాదు. అది అరాచకం. అరాచకాల్ని తిప్పికొట్టాలి. అరాచక రాజకీయవేత్తలకు బుద్ది చెప్పాలి' అని కేసీఆర్ పాలేరు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.
▶️ మాజీ పీసీసీ అధ్యక్షుడు రైతుబంధు దుబారా అంటడు
— BRS Party (@BRSparty) October 27, 2023
▶️ ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రైతులకు 3 గంటలు కరెంట్ చాలు అంటడు
❌ పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే రైతులు మల్లా ఆగం అవుతారు.
- పాలేరు సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్.#SayNoToScamgress pic.twitter.com/eEaHGf1E7r
భక్తరామదాసు ప్రాజెక్టు, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు వచ్చిన తర్వాత పాలేరులో రైతులు సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి, వ్యవసాయ శాష్ట్రవేత్త స్వామినాథన్ వంటి వారు ప్రశసించారని తెలిపారు. రాష్ట్ర సంపద పెరుగుతున్న కొద్దీ.. సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతున్నామన్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు, దళితబంధు ఉండవని హెచ్చరించారు కేసీఆర్.
-
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications