వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న కేసిఆర్.!రాజ్యాంగ నిర్మాతకు మంత్రి సత్యవతి ఘన నివాళులు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేథావి, నిమ్న వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ముందు చూపువల్లే నేడు మన దేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అందువల్లే సమాజంలో దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

అంబేద్కర్ ఆశయలకనుగుణంగా సీఎం పథకాలు..

అంబేద్కర్ ఆశయలకనుగుణంగా సీఎం పథకాలు..

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అంబేద్కర్ స్పూర్తితో ఆయన ఆశయాలను అమలు చేస్తూ నిజమైన అంబేద్కర్ వాదిగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారన్నారని, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పాలన నేడు దేశానికి దిక్సూచి అవుతుందన్నారు. విద్యతోనే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆశయంమేరకు, అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో 125కి పైగా గురుకుల విద్యాలయాలు ప్రకటించి, ఈ ఏడేళ్ల లో 978 గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయడం విద్యకు మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్..

అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్..

దళితులు, గిరిజనులు కూడా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశ్యంతో అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పేరిట విదేశాల్లో చదివే వారికి 20 లక్షల రూపాయల స్కాలర్ షిప్ అందిస్తున్న గొప్ప అంబేద్కర్ వాది ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. చదువుకున్న తర్వాత స్వయం ఉపాధికి శిక్షణ ఇస్తూ, పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన పథకం కింద 50 లక్షల వరకు సబ్సిడీ ఇస్తూ వారికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో శిక్షణ ఇప్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు.

 ఎస్సీ, ఎస్టీ ప్రగతి ప్రత్యేక నిధి చట్టం..

ఎస్సీ, ఎస్టీ ప్రగతి ప్రత్యేక నిధి చట్టం..

దళితులు, గిరిజనులకు కేటాయించిన నిధులు వారికే ఖర్చు కావాలని ఎస్సీ, ఎస్టీ ప్రగతి ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని తీసుకొచ్చి, జనాభాకనుగుణంగా నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేసారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు ఖర్చు చేయలేకపోతే మరుసటి సంవత్సరానికి ఆ నిధులు బదిలీ అయ్యే విధంగా చట్టం చేసి వారి నిజమైన ప్రగతికి పట్టం కడుతున్నారని కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ సమాజంలో ముందుకు నడవాలని తెలిపారు.

 సిఎం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

సిఎం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

అంతే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కల్పించిన పథకాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చేవిధంగా ఎదగడమే అంబేద్కర్ కి మనం ఇచ్చే నిజమైన నివాళిగా మంత్రి సత్యవతి రాథోడ్ అభివర్ణించారు. రాబోవు రోజుల్లో యువత అంబేడ్కర్ ఆశయాలకనుగుణంగా నడచుకోవడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అవలంభిస్తున్న అహింసా విధానాలను అలవాటు చేసుకోవాలని, సన్మార్గంలో నడిచినప్పుడే మంచి అంవకాశాలు అందుకోగలుగుతారని, అందుకు అంబేడ్కర్ చూపించిన మార్గం ఎంతో విలువైందని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేసారు. కాబట్టి నేటి యువత మహనీయులు జీవితాలను ఆదర్శంగా తీసువాల్సిన అవసరం ఉందని ఉద్బోదించారు మంత్రి సత్యతి రాథోడ్.

English summary
Minister of State for Tribal Welfare and Women and Child Welfare Mrs. Satyavati Rathore paid a heartfelt tribute to the late, the Constitution Maker of India, a world genius and a member of the lower castes Dr. B.R Ambedkar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X