కేసీఆర్ 420; అటవీ అధికారిది ప్రభుత్వ హత్యే.. పోడు చిచ్చు పెట్టారన్న వైఎస్ షర్మిల
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ములుగు జిల్లాలో పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కెసిఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఫారెస్ట్ అధికారులు, గిరిజనుల మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టారని, ఇరువర్గాలను రెచ్చగొట్టి కేసీఆర్ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని వైయస్ షర్మిల విమర్శించారు.
అటవీ అధికారి శ్రీనివాస రావు హత్య ప్రభుత్వ హత్య
పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి కెసిఆర్ చిచ్చు పెట్టాడని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన అటవీ అధికారి శ్రీనివాస రావు హత్య ప్రభుత్వ హత్యనే అని వైయస్ షర్మిల విమర్శించారు. పోడు భూములను బలవంతంగా లాక్కుని మొక్కలు నాటించారని, ఆడవాళ్ళను, చంటి బిడ్డల తల్లులను కూడా చూడకుండా జుట్టుపట్టి , ఈడ్చుకెళ్ళి కొట్టారని వైయస్ షర్మిల విమర్శించారు.
ఎన్నో సంవత్సరాలుగా ఆదివాసీలపై దాడులు జరుగుతున్నా ఏ ఒక్క రోజు కూడా కెసిఆర్ స్పందించలేదని పేర్కొన్న వైయస్ షర్మిల ఇప్పుడు ఓ అటవీ అధికారి చావుకు కేసీఆర్ కారణమయ్యారని నిప్పులు చెరిగారు. అటవీ సిబ్బంది ఆదివాసీల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని పేర్కొన్న ఆమె పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని కేసీఆర్ రెండుసార్లు అధికారం చేపట్టినా ఇంతవరకు ఎటువంటి పరిష్కారాన్ని చూపించలేదని పేర్కొన్నారు.

బంగారం లాంటి బిల్ట్ ఫ్యాక్టరీని కెసిఆర్ మూసేసాడు
బంగారు తెలంగాణలో బంగారంలాంటి 'బిల్ట్' ఫ్యాక్టరీని కెసిఆర్ మూసేసాడు అని విమర్శించారు. 5వేల మందికి ఉద్యోగాలు, 20వేల మందికి ఉపాధి లేకుండా చేశాడని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఏటా రూ.750కోట్లు విడుదల చేసి, ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామన్న కేసీఆర్.. ఇంతవరకు నయాపైసా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ హయాంలోనే ఈ ఫ్యాక్టరీ విరాజిల్లిందని వైయస్ షర్మిల గుర్తు చేశారు. జాతీయ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

అప్పు తెచ్చి కుటుంబానికి బిర్యాని.. తెలంగాణ ప్రజలకు చిప్ప
మా తాతలు నేతులు తాగారు.. కావాలంటే మా మూతుల వాసన చూడండి అన్నాడట కెసిఆర్ లాంటోడు! అంటూ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనని గప్పాలు కొట్టి,అంకెల గారడీతో, అరచేతిలో వైకుంఠం చూపిన కెసిఆర్ గారి రూ.2.5లక్షల కోట్ల బడ్జెట్, 4నెలలు మిగిలి ఉండగానే రూ.40వేల కోట్ల లోటుతో చేతులెత్తేసింది అంటూ కెసిఆర్ చెప్పే మాటలకు, రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితికి సంబంధమే లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. అప్పుతెచ్చి తన కుటుంబానికి బిర్యానీ పెట్టి, తెలంగాణ ప్రజల చేతుల్లో చిప్ప పెట్టారని కేసీఆర్ పై మండిపడ్డారు.

420 కెసిఆర్.. మూడు అప్పులు ఆరు కమిషన్లతో వర్ధిల్లుతున్నాడు
బడ్జెట్ అంచనాలు తప్పినా తన చేతకానితనమని ఒప్పుకోకుండా బట్ట కాల్చి, కేంద్రం మీద నెపం మోపి, తప్పించుకోవాలని కెసిఆర్ చూస్తున్నారు అంటూ ఆరోపించారు. 420 కెసిఆర్ మూడు అప్పులు.. ఆరు కమీషన్లతో వర్ధిల్లుతున్నాడని వైయస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న వైయస్ షర్మిల వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన రైతులందరికీ పోడు పట్టాలు ఇవ్వడమే కాకుండా యువతకు, మహిళలకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాటిస్తున్నా అని పేర్కొన్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications