తెలంగాణ రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహి కేసీఆర్.! ఢిల్లీలో తెలంగాణ సీఎంపై మండిపడ్డ బండి సంజయ్.!

ఢిల్లీ/హైదరాబాద్ : ఏపీ-తెలంగాణ జలవివాదాలపై తెలంగాణ సీఎం చంద్రశేకర్ రావు ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు. బుదవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. క్రిష్ణా-గోదావరి బోర్డులు నిర్వహించే సమావేశానికి ఎందుకు హాజరు కావడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం హాజరు కాకపోవడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. క్రిష్ణా-గోదావరి బోర్డుల సమావేశానికి హాజరై ఉంటే ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపే అవకాశముండేదన్నారు బండి సంజయ్. తెలంగాణకు రావాల్సిన నీటిని పొందే హక్కు ఉండేది. అయినా ఆ సమావేశానికి ఎందుకు హాజరు కావడంలేదు. ఇది చంద్రవేఖర్ రావు ఒంటెద్దు పోకడకు నిదర్శనమని బండి సంజయ్ మండిపడ్డారు.

క్రిష్ణా-గోదావరి బోర్డుల సమావేశానికి ఎందుకు హాజరు కావడం లేదు.. కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించిన బండి సంజయ్..

క్రిష్ణా-గోదావరి బోర్డుల సమావేశానికి ఎందుకు హాజరు కావడం లేదు.. కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించిన బండి సంజయ్..

ఏపీ సర్కార్ అదనంగా ప్రతి ఏటా 150 టీఎంసీల నీటిని వాడుకుంటోందని, తెలంగాణకు నష్టం జరిగేలా అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని, బోర్డు సమావేశాలకు హాజరై ఉంటే వాటిని ప్రశ్నించి అడ్డుకునే అవకాశం ఉండేదని, తెలంగాణపై అనుమతి లేని ప్రాజెక్టులకు 6 నెలల్లోనే అనుమతి వచ్చే అవకాశం ఉండేదని సంజయ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణాకు మేలు జరిగే అవకాశం ఉన్నా సీఎం ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశానికి హాజరైతే తాను చేసిన అక్రమాలన్నీ బయటపడతాయని చంద్రవేకర్ రావుకు భయం పట్టుకుందని, జగన్ తో కుమ్కక్కైనట్లు అడ్డగోలుగా దోచుకున్న కమీషన్ల వ్యవహారం జనానికి తెలిసిపోతుందనుకునే హాజరుకాలేదని విమర్శించారు సంజయ్.

తెలంగాణ కు తీవ్ర నష్టం.. కేసీఆర్ వైఖరి మార్చుకోవాలన్ని సంజయ్..

తెలంగాణ కు తీవ్ర నష్టం.. కేసీఆర్ వైఖరి మార్చుకోవాలన్ని సంజయ్..

గతంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మిస్తుంటే చంద్రశేఖర్ రావు ప్రశ్నించలేదని, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతూ తెలంగాణకు అన్యాయం చేస్తుంటే పట్టించుకోడని సంజయ్ మండిపడ్డారు. తాను లేఖ రాస్తే సీఎస్ తో ప్రకటన చేయించాడని, తాను కోరిన మీదటే గజేంద్ర షేకావత్ తో మీటింగ్ ఏర్పాటు చేయించాడని, అయినా ఆ సమావేశానికి వెళ్లకుండా సీఎం చంద్రశేఖర్ రావు ప్రజలకు అన్యాయం చేసాడని సంజయ్ స్పష్టం చేసారు. బహుశా ముఖ్యమంత్రిగా ఉంటూ రోజువారీ షెడ్యూల్ విడుదల చేయని సీఎం ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రవేఖర్ రావు మాత్రమేనని ఎద్దేవా చేసారు.

ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్.. నీళ్ల అంశంలో అన్నీ పొరపాట్లే..

ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్.. నీళ్ల అంశంలో అన్నీ పొరపాట్లే..

నాటి కేంద్ర మంత్రి ఉమాభారతి, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి హరీష్ రావు, జల వనరుల సలహాదారు విద్యాసాగర్ రావు సమక్షంలోనే సంతకం చేసారని, ఇది నిజం కాదా చంద్రశేఖర్ రావు చెప్పాలని నిలదీసారు. చివరకు తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల నీళ్లను కూడా పూర్తిగా వాడుకోలేని దౌర్భాగ్య సీఎం చంద్రశేఖర్ రావేనని మండిపడ్డారు. ఏపీ-తెలంగాణ వివాదాలపై సుప్రీంకోర్టులో ఉన్న కేసును విత్ డ్రా చేసుకుంటే సమస్య పరిష్కారానికి మీటింగ్ పెడతానని ఆనాడు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ చెబితే కేసును విత్ డ్రా చేసుకున్నట్లు ప్రకటించిన చంద్రశేఖర్ రావు ఇప్పటి వరకు ఆ హామీని నిలబెట్టుకోలేకపోయిన మాట నిజం కాదా అని సంజయ్ ప్రవ్నించారు.

కేసీఆర్ సోయి తెచ్చుకోవాలి.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించాలన్న సంజయ్..

కేసీఆర్ సోయి తెచ్చుకోవాలి.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించాలన్న సంజయ్..

తెలంగాణ రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహి సీఎం చంద్రశేఖర్ రావు అని ఘాటుగా విమర్శించారు సంజయ్. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే నీళ్ల కోసం. కానీ ఆ నీళ్ల విషయంలో ఏపీతో కుమ్కక్కై తెలంగాణాకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేసారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లోపాయి కారీ ఒప్పందాలతో అవకాశ వాద రాజకీయాలకు పాల్పడుతున్నరని, ఇప్పటికైనా చంద్రశేఖర్ రావు సోయి తెచ్చుకుని క్రిష్ణా-గోదావరి బోర్డుల సమావేశానికి హాజరు కావాలని సంజయ్ డిమాండ్ చేసారు. ఏపీ అక్రమాలను ఎండగట్టి, తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని నివారించి, తెలంగాణ వాటా 550 టీఎంసీల నీటిని పొందేలా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+