అసెంబ్లీ భేటీ వేళ కేసీఆర్ అనూహ్య నిర్ణయం - రేవంత్ వాట్ నెక్స్ట్..!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు రేపు (శనివారం) ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం పైన కమిషన్ నివేదిక ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. దీని పైన చర్చ.. పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తరువాత ప్రభుత్వం చర్యల పైన ప్రకటన చేసేందుకు సిద్దం అవుతోంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన మాజీ సీఎం కేసీఆర్ ఈ సమావేశాల వేళ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రేవంత్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మండలిలో మాగం రంగారెడ్డికి సంతాపం ప్రకటించి సభకు వాయిదా వేయనున్నారు. ఆ తరువాత బీఏసీ సమావేశం లో సమావేశ అజెండా.. సభను ఎన్ని రోజుల నిర్వహించాలనేది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక.. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రభుత్వం బీఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టేందుకు అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఈ సమయంలోనే ఇదే రిపోర్టు.. సభలో చర్చ గురించి మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్ తో సహా పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేసారు.

అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు తమకు తగినంత సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేయనున్నారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదిక పెట్టడానికి ముందే తమకు రిపోర్ట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు. ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు.
ఇంకోవైపు ఎప్పటిలానే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటారా అనే ప్రశ్నల వేళ.. కేసీఆర్ సభకు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. సభలోనే కాళేశ్వరం పైన సమాధానం చెప్పకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. ఆ ప్రాజెక్టు ద్వారా జరిగిన ప్రయోజనాలను వివరిస్తూనే.. ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. దీంతో, కేసీఆర్ సభకు వస్తే... సీఎం రేవంత్ టీం ఎలాంటి వ్యూహాల తో సిద్దం అవుతోంది.. సభలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications