సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన; కేసీఆర్ కాలుపెడితే సస్యశ్యామలమే: మంత్రి హరీష్ రావు
సింగూరు ప్రాజెక్టు పై నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా నారాయణఖేడ్ కు చేరుకున్న ఆయన ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు తో పాటుగా, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్ ద్వారా 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు
సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 3.84 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో 57 వేల ఎకరాలు, ఆందోల్ లో 56 వేల ఎకరాలు, జహీరాబాద్ లో 1.06 లక్షల ఎకరాలు, నారాయణఖేడ్ లో 1.65 లక్షల ఎకరాలకు రెండు లిఫ్టుల ద్వారా సాగునీరు అందించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని సింగూరుకు తరలించి అక్కడి నుండి లిఫ్ట్ ల ద్వారా నాలుగు నియోజకవర్గాలకు నీరందించే ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 4,427 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని తెలుస్తుంది.
దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానన్న కేసీఆర్
సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుపై మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తనదని చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 4వేల కోట్లతో దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టుకు తన చేతులతో శంకుస్థాపన చేశానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మంత్రి హరీష్ రావుకు సీఎం కేసీఆర్ కితాబు.. ఏడాదిన్నరలో ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలా చూడాలన్న సీఎం
ప్రజల కోసం పని చేయాలనే తపన ఉన్న మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లాలో ఉన్నందుకు మంచి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. మంత్రి హరీష్ రావు క్రియాశీలకమైన మంత్రి అని, బాగా కష్టపడే మంత్రి అని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి అధికారులు, కాంట్రాక్టర్ల వెంటపడి ఏడాదిన్నర లోపు ప్రాజెక్టు పనులు పూర్తి చేయించి అన్ని ప్రాంతాలకు నీరు అందేలా చూడాలని, ఆ బాధ్యత మంత్రి హరీష్ రావు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.
కేసీఆర్ ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రాంతం సస్యశ్యామలం : హరీష్ కితాబు
సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి హరీష్ రావు పురాణాల్లో రాముడు కాలు పెడితే రాయి అహల్యగా మారిందని, నేడు సీఎం కేసీఆర్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని కొనియాడారు. సంగారెడ్డి జిల్లా చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా అంటేనే తాగడానికి గుక్కెడు నీళ్లు లేని జిల్లా అని సమైక్య రాష్ట్రంలో ఎవరు మన గురించి ఆలోచించ లేదని పేర్కొన్నారు హరీష్ రావు.
Recommended Video
కోటి ఎకరాల మాగాణిగా మన తెలంగాణ.. ఆ ఘటన కేసీఆర్ దే: హరీష్ రావు
ఇప్పుడు పరిస్థితులు మారాయని, సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కాబోతుందని వెల్లడించారు. ఎక్కడో 90 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న గోదావరి జలాలను మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ కు, మల్లన్న సాగర్ నుంచి సింగూర్, సింగూర్ నుంచి జహీరాబాద్, నారాయణఖేడ్ కు అందించబోతున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు. కోటి ఎకరాల మాగాణిగా మన తెలంగాణను ఏడేళ్ల కాలంలో తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ దేనని మంత్రి హరీష్ రావు కితాబిచ్చారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications