వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెత్త తట్టను నెత్తిన పెట్టుకున్న కేసీఆర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని చెత్తను ఊడ్చే పారిశుద్ధ్య కార్మికులు తన దృష్టిలో దేవుళ్లని, నగరంలోని ఇలాంటి వాతావరణంలో ఉండగలుగుతున్నామంటే అది వాళ్ల చలవేనని, వారికి చేతులెత్తి మొక్కాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం అన్నారు.

హైదరాబాద్ భేష్ కావాలని, ముందు తరాలకు అందమైన నగరాన్ని అందిద్దామన్నారు. శనివారం కేసీఆర్ సికింద్రాబాదులోని పార్సిగుట్టలో చెత్తను ఎత్తిపోసి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నేపథ్యంలో గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్ చీపురు పట్టారు. అంతకుముందు హైటెక్స్‌లో స్వచ్ఛ హైదరాబాద్‌‌ను ప్రారంభించారు. అందరూ కలిసి చెత్తను దూరం చేస్తే ప్రతిరోజూ వీధులను ఊడ్చే దేవుళ్లలాంటి సఫాయి కర్మచారీలపై భారం కొంత తగ్గుతుందని కేసీఆర్ అన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

హైదరాబాద్‌ నగరం అత్యంత నివాస యోగ్యమైన ప్రాంతంగా పేరు పొందిందన్నారు. ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్‌ లింగ్డో కూడా హైదరాబాద్‌లోనే స్థిర నివాసం ఏర్పరుచుకోవడం ఇందుకు ఉదాహణగా చెప్పారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

గొప్ప ఖ్యాతి, ప్రఖ్యాతలు ఉండాల్సిన నగరం అలాంటి పరిస్థితుల్లో లేదని, ఇందులో మార్పు తెచ్చేందుకు స్వచ్ఛ హైదరాబాద్‌ను చేపట్టామన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

అధికారులంతా ఆదివారం ఉదయం బస్తీల్లో 4-5 గంటలపాటు వారితో ఉండి స్వచ్ఛ హైదరాబాద్‌ నిర్వహించాలన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

బస్తీలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని, మౌలిక సదుపాయాలు, మార్కెట్లు, మంచినీరు, శ్మశాన వాటికలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

ప్లాన్‌ ది బస్తీ పేరుతో ప్రణాళిక రూపొందించాలన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు పెడుతోందని తెలిపారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్‌ నుంచి రూ.75 కోట్లు ఇప్పించిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

ఓ విభాగానికి నేతృత్వం వహించడానికి అంగీకరించిన గవర్నర్‌ నరసింహన్‌, కార్యక్రమ రూపకల్పన చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌ కుమార్‌కు అభినందనలు తెలిపారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్‌ను శాస్ర్తీయంగా, సమగ్రంగా చేపట్టిన కార్యక్రమం. దీనిని ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజల కార్యక్రమంలా నిర్వహించాలన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

మూసీ ప్రక్షాళనను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ సూచించారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ తెలంగాణ - స్వచ్ఛ హైదరాబాద్‌ లోగో, జీహెచ్‌ఎంసీ రూపొందించిన స్వచ్ఛ హైదరాబాద్‌ ఫేస్‌బుక్‌ పేజీని కేసీఆర్‌ ప్రారంభించారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌ ఆధ్వర్యంలో తయారు చేసిన పాటల సీడిని ఆవిష్కరించారు.

స్వచ్ఛ హైదరాబాద్

స్వచ్ఛ హైదరాబాద్

నగరంలోని చెత్తను ఊడ్చే పారిశుద్ధ్య కార్మికులు తన దృష్టిలో దేవుళ్లని, నగరంలోని ఇలాంటి వాతావరణంలో ఉండగలుగుతున్నామంటే అది వాళ్ల చలవేనని, వారికి చేతులెత్తి మొక్కాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం అన్నారు.

English summary
KCR leads Swachh Hyderabad campaign
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X