KCR: ఏం జరుగుతుందో చూద్దాం.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ ఓటమి తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వానికి సహకరిద్ధామని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూద్దామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారట. ప్రజల తీర్పును గౌరవిద్దాం.. రాజ్యాంగ బద్దంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నదని.. కానీ, ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నామని వ్యాఖ్యానిచ్చిట్లు తెలుస్తోంది.
కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏమి జరుగుతుందో వేచి చూద్దామని చెప్పినట్లు సమాచారం. త్వరలో తెలంగాణ భవన్ లో పార్టీ సమావేశం నిర్వహించుకుని.. ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసుకుందామని ఎమ్మెల్యేతో అన్నట్లు తెలుస్తోంది. త్వరలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుందామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తొలిసారి ప్రతిపక్షంలో కూర్చోబోతోంది.

బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఓవైపు కాంగ్రెస్ పెద్దలు సీఎం ఎవరు అనేదానిపై బిజీగా ఉంటే.. ఇటు బీఆర్ఎస్ లో మాత్రం ప్రతిపక్ష నేతగా ఎవరు ఉండాలనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. కేటీఆర్ శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేస్తారా లేక హరీశ్ రావు అవకాశం కల్పిస్తారా అనేది చూడాలి.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఓఎస్డీతో గవర్నర్ కు పంపారు. లేఖ అందుకున్న గవర్నర్ వెంటనే కేసీఆర్ రాజీనామాను ఆమోదించింది. అయితే కాంగ్రెస్ నుంచి ఎవరు సీఎం అవుతారనది ఉత్కంఠ మారింది. సోమవారం రాత్రికే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం సీన్ ఢిల్లీకి చేరింది.












Click it and Unblock the Notifications