దేశ ప్రజలకు కేసీఆర్ మహా శివరాత్రి శుభాకాంక్షలు; తెలంగాణా వ్యాప్తంగా జంగమయ్య జాతర ఇలా!!
దేశ ప్రజలకు కేసీఆర్ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణా వ్యాప్తంగా జంగమయ్య జాతర చాలా భక్తి పారవశ్యంతో కొనసాగుతుంది.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలలో భక్తజనం పోటెత్తుతోంది. ప్రముఖశైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం వేళ శివుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన కెసిఆర్ శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, జాగరణ, పూజలు, అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలోనూ ఆత్మశుద్ధిని, పరివర్తనను కలిగిస్తాయని పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ప్రార్థించారు. లయకారుడిగా, అర్ధనారీశ్వరుడిగా హిందువులు కొలిచే ఆ మహాదేవుడి దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షను వ్యక్తం చేశారు.

వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఇదిలా ఉంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శనివారం రాష్ట్రదేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు . అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో హరిద్ర నాథ్ పట్టు వస్త్రాలు సమర్పించారు.

కరీంనగర్ లో మహాశివరాత్రి వేడుకలు ఇలా
అంతేకాదు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రం లో పాత బజార్ పురాతన శివాలయం లో మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ శివలింగానికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. హుజురాబాద్ నియోజకవర్గం లో శాసన సభ్యులు మాజీ మంత్రి, బీజీపీ సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ జమ్మికుంట విశ్వేశ్వరాయలం తో పాటు పలు ఆలయాలలో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పెద్దపల్లిలో ఘనంగా శివరాత్రి వేడుకలు
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర లోని ప్రముఖ శైవ క్షేత్రం పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు శని త్రయోదశి తో పాటు మహా శివరాత్రి వేడుకలు ఒకేరోజు రావడం తో భక్తులతో ఆలయం పోటెత్తింది. ఉదయం నుండే స్వామి వారికీ పంచ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నారు. దీంతో పాటు రాత్రి లింగోద్బవ సమయంలో మహా న్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని శైవ క్షేత్రాలను మహాశివరాత్రి వేడుకలకు అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. శనివారం తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాల్లో నిర్వహించే అభిషేకాలకు భక్తులు తరలివచ్చారు. అందుకు తగ్గట్టుగా శివాలయాల్లో ఏర్పాట్లను చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా లోని తీర్థాల సంఘమేశ్వర స్వామి ఆలయం, నీలాద్రిశ్వరాలయం, కూసుమంచి శ్రీ గణపేశ్వరాలయం, మధిర శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయాలల్లో జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. మధిరలోని మృత్యుంజయ స్వామి వారి ఆలయం ఎదురుగా ఉన్న ఏటిలో తెల్లవారుజామునే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో శివరాత్రి వేడుకలు
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు హర నామ స్మరణతో మారు మోగుతున్నాయి... తెల్లవారు జాము 3గంటల నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు... స్వామివారి దర్శనం చేసుకొని అభిషేక పూజల్లో పాల్గొన్న భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టారు... నల్లగొండ లోని పానగల్లు చాయా సోమేశ్వర స్వామి దేవాలయంకు భక్తులు భారీగా తరలి వచ్చారు . స్వామివారి దర్శనం కోసం అరకిలోమీటరు కు పైగా భక్తులు వేచి ఉన్నారు .. ఇక చెరువుగట్టు కొండపై కూడా భక్తులు భారీగా తరలిరావడంతో పరిసరాలు కిక్కిరిసి పోయాయి . మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులలో ఉన్న వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాల భక్తుల తాకిడి పెరిగింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేడుకలు ఇలా
మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఉమామహేశ్వరాలయం, గంగపుత్ర శివాలయం, కేస్లాపూర్ నాగోబా అలయం, కుంటాల జలపాతం సమీపంలోని సోమేశ్వరాలయం, ఇచ్చొడ మండలం సిరిచెల్మ మల్లికార్జున ఆలయం, మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల మల్లన్న ఆలయం, బెల్లంపల్లి బుగ్గరాజరాజేశ్వరాలయం, నిర్మల్ జిల్లా కదిలి పాపహరేశ్వరాలయం, కొమురంభీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఈస్గావ్ శివమల్లన్న స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications