ఫెడరల్ ఫ్రంట్: కరుణానిధి, స్టాలిన్‌లతో కేసీఆర్ భేటీ
హైదరాబాద్/చెన్నై: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం మధ్యాహ్నం డీఎంకే చీఫ్ స్టాలిన్, కరుణానిధిలతో భేటీ అయ్యారు.
కేసీఆర్ అంతకుముందు హైదరాబాద్ నుంచి చెన్నై బయలుదేరి వెళ్లారు. దేశంలో గుణాత్మకమైన మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్.. ఇందుకోసం ఇప్పటికే పలువురు నేతలను కలిసి చర్చించారు.

ఈ క్రమంలోనే డీఎంకే అధినేత కరుణానిధితో పాటు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అయ్యారు. కేసీఆర్ వెంట ఎంపీలు కె కేశవ రావు, వినోద్, మంత్రి ఈటెల రాజేందర్, మిషన్ భగీరథ ఛైర్మన్ వేముల ప్రశాంత్, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఈ రోజు రాత్రికి చెన్నైలోనే బస చేయనున్న కేసీఆర్ రేపు హైదరాబాద్ చేరుకుంటారు.












Click it and Unblock the Notifications