వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్ సాక్షిగా కేసీఆర్ నయా పాలిటిక్స్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలతో కేంద్రంలో అధికారి బిజెపిని ఇరకాటంలో పెట్టడానికి, ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ పెంచుకోవడానికి, దేశంలోని పార్టీలను బిఆర్ఎస్ వైపు ఆకర్షించడానికి ప్రయత్నం చేయనున్నారు.

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాలు మొదలుపెట్టిన నాటి నుండి ప్రధానంగా ఆయన ఫోకస్ జాతీయంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అన్నదానిపైనే ఉంది. అందుకు దొరికే ప్రతి చిన్న అవకాశాన్ని కేసీఆర్ వినియోగించుకోవాలని చూస్తున్నారు. తాజాగా పార్లమెంటు సమావేశాలను కెసిఆర్ తన జాతీయ రాజకీయాలకు, బి ఆర్ ఎస్ పట్ల వివిధ పార్టీలలో సానుకూల దృక్పథం పెంచడానికి వ్యూహాత్మకంగా వినియోగించనున్నారు.

కేంద్రంపై కేసీఆర్ పోరాటం.. ప్రతీ అవకాశాన్ని వాడుకుంటున్న గులాబీ బాస్

కేంద్రంపై కేసీఆర్ పోరాటం.. ప్రతీ అవకాశాన్ని వాడుకుంటున్న గులాబీ బాస్

తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా దేశంలో ఎదగాలని వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలలో తెలుగు వాళ్లకు బలం ఉన్నచోట వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న ఆయన, జాతీయంగా వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31వ తేదీ నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను టార్గెట్ చేస్తూ కేంద్రంపై పోరాటం చేయడానికి తెలంగాణ ఎంపీలకు దిశ నిర్దేశం చేశారు.

జాతీయ సమస్యలపై పోరాటం చెయ్యాలని కేసీఆర్

జాతీయ సమస్యలపై పోరాటం చెయ్యాలని కేసీఆర్


బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలను లేవనెత్తాలి? ఏ అంశాలపై పోరాటం చేయాలి? ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హామీలతో పాటుగా, గవర్నర్ల వ్యవహారం పై పార్లమెంట్లో ప్రస్తావించాలని కెసిఆర్ నిర్ణయించారు. అంతేకాదు కలిసి వచ్చే పార్టీలతో జాతీయ సమస్యల పైన కూడా పార్లమెంటు వేదికగా పోరాటం చేయాలని కెసిఆర్ సూచించారు. ఇక జాతీయంగా వివిధ పార్టీలు కేంద్రం విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమస్యలు ఏంటి? ఆ సమస్యలపై ఏ విధంగా పోరాటం చేయాలి అన్నదాని పైన కూడా కెసిఆర్ తెలంగాణ ఎంపీలతో సుదీర్ఘంగా చర్చించారు.

బీఆర్ఎస్ తో కలిసొచ్చే పార్టీల వేటలో కేసీఆర్ వ్యూహం

బీఆర్ఎస్ తో కలిసొచ్చే పార్టీల వేటలో కేసీఆర్ వ్యూహం

తెలంగాణ రాష్ట్ర సమస్యలపై మాత్రమే కాకుండా జాతీయ సమస్యలపై కూడా పోరాటం చేయాలని కెసిఆర్ నిర్ణయించడం వెనుక జాతీయంగా తమకు మద్దతు ఇచ్చే పార్టీలు ఎవరుంటారు అన్నదాన్ని గుర్తించి, భవిష్యత్తులో ఆయా పార్టీలతో కలిసి పని చేసే ఉద్దేశం ఉన్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పట్ల ఆకర్షితులు అవుతున్న వారితో ఒక్కొక్కరితో మంతనాలు జరుపుతున్న కేసీఆర్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల కేంద్రంగానూ, బీఆర్ఎస్ ను బలంగా చూపించి జాతీయ రాజకీయాలలో తమకు మద్దతు ఇచ్చే నాయకులను గుర్తించే పనిలో పడ్డారు.

దేశంలోని రాజకీయ పార్టీల దృష్టి ఆకర్షించే యత్నం

దేశంలోని రాజకీయ పార్టీల దృష్టి ఆకర్షించే యత్నం

జాతీయ రాజకీయాల కోసం ఏ చిన్న అవకాశం దొరికినా కూడా, సద్వినియోగం చేసుకుంటున్న కేసీఆర్ కేంద్ర బడ్జెట్ సమావేశాలు జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 13 వరకు, మార్చి 13 నుండి ఏప్రిల్ ఆరవ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలలో దేశంలోని రాజకీయ పార్టీల అటెన్షన్ ను తమ వైపుకు ఎలా తిప్పుకోవాలి అన్న దానిపైన కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారు.

కేసీఆర్ టార్గెట్ ఇదే ... సక్సెస్ అవుతారా?

కేసీఆర్ టార్గెట్ ఇదే ... సక్సెస్ అవుతారా?

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం నుండి, పార్లమెంట్లో అనుసరించాల్సిన ప్రతి వ్యూహాన్ని ఆయన ఇప్పటికే ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. మరి కెసిఆర్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలతో కేంద్రంలో అధికారి బిజెపిని ఇరకాటంలో పెట్టడానికి, ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ పెంచుకోవడానికి, దేశంలోని పార్టీలను బిఆర్ఎస్ వైపు ఆకర్షించడానికి ప్రయత్నం చేయనున్నారు. మరి ఈ ప్రయత్నంలో కేసీఆర్ ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది పార్లమెంటు బడ్జెట్ సమావేశాలతో అర్థమవుతుంది.

English summary
KCR opened the door to new politics in the budget meetings to be held as a witness of the Parliament. KCR has planned to fight with the parties that come together on national issues and thus identify the parties that support him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X