హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మునుగోడులో గెలిస్తే అలా..! లేదంటే ఇలా..? KCR వ్యూహం

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో ఉప ఎన్నికలేమీ లేవు అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా ఊడిపడింది.. మునుగోడు. ఇక్కడి నుంచి ప్రతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఎన్నిక అనివార్యమైంది. ఆ పార్టీ తరఫున రంగంలోకి దిగిన కోమటిరెడ్డికి ప్రధాన ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు.

 కేసీఆర్ వ్యూహరచన!

కేసీఆర్ వ్యూహరచన!


ఇప్పటికే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా మునుగోడు మారిందంటూ వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు డబ్బులు వెదజల్లుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కోమటిరెడ్డికి ఇక్కడ గెలవడం ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీకి కూడా అంతే. ఇక్కడ గెలిస్తే రాష్ట్రంలోని ప్రజలంతా తమవెంటే ఉన్నారని సాధారణ ఎన్నికల్లో చెప్పుకోవడానికి బీజేపీకి ఉపయోగపడుతుంది. ఒకరకంగా ఆ పార్టీ ఈ ఎన్నికను సెమీఫైనల్ గా భావిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి వ్యూహరచన చేస్తున్నారు.

ప్రణాళికను మార్చిన కేసీఆర్

ప్రణాళికను మార్చిన కేసీఆర్


కొంత కాలం క్రితం వరకు తెలంగాణ శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరగుతాయంటూ జోరుగా వార్తలు వచ్చాయి. అయితే కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. మునుగోడు శాసనసభా స్థానాన్ని దక్కించుకుంటే ప్రజలంతా గులాబీ దళంవైపే ఉన్నారని చెప్పడానికి అవకాశం ఉంది. దీన్ని పునాదిగా మలచుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ మునుగోడులో ఓటమి పాలైతే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయంటున్నారు.

'ఎమ్మెల్యేలకు ఎర'.. కలిసొస్తుంది?

'ఎమ్మెల్యేలకు ఎర'.. కలిసొస్తుంది?


మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న తరుణంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరిగాయి. ఆడియో రికార్డులతో సహా అన్నింటి వివరాలకు బయటకు వచ్చాయి. వీరిలో రోహిత్ రెడ్డికి ప్రభుత్వం సెక్యూరిటీని పెంచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ప్రణాళికలు అల్లిందని, వారంతా అధికార పార్టీవైపే ఉండి ప్రలోభాలకు లొంగకపోవడంవల్లే బీజేపీ పాచిక పారలేదని కేసీఆర్ మండిపడుతున్నారు. ఈ అంశాన్ని కూడా ఆయన ఎన్నికలకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. మునుగోడుకు తోడు ఈ అంశం కూడా టీఆర్ఎస్ కు కలిసొస్తుందని, అలాకాకుండా మునుగోడులో ఓటమిపాలైతే ఎమ్మెల్యేలకు ఎర అంశం కూడా బలహీనపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Attempts were made to buy TRS MLAs at the time when the by-election was going on earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X