కేరళ వినతి: తక్షణమే 500 టన్నుల బియ్యం పంపాలని కేసీఆర్, పినరయి థ్యాంక్స్

Recommended Video

    కేరళ రాష్ట్రానికి ఆహారాన్ని పంపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

    హైదరాబాద్‌: కేరళ రాష్ట్రానికి అన్ని విధాల సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా, కేరళ రాష్ట్రానికి మరోసాయం అందించారు. కేరళకు వెంటనే 500టన్నుల బియ్యం పంపాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

    వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం సరఫరా చేయడానికి బియ్యం పంపాలని కేరళ రాష్ట్రం నుంచి విజ్ఞప్తి వచ్చిన వెంటనే సీఎం స్పందించారు. 25 కోట్ల నగదుతో పాటు ఆర్వో యంత్రాలు, పౌష్టికాహారం పంపినందుకు కేరళ సీఎం పినరయి విజయన్‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు.

    KCR orders 500 tonnes of rice be sent to Kerala.

    కేరళ అధికారులు కూడా తెలంగాణ అధికారులతో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. కేరళకు ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ తమను ఆదేశించారని ఈసందర్భంగా తెలంగాణ అధికారులు చెప్పారు. తమకు బియ్యం అవసరమని కేరళ అధికారులు కోరడంతో దీనిపై సీఎం కేసిఆర్ వెంటనే స్పందించారు.

    మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ ఎస్‌కే జోషి, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్‌తో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వెంటనే కేరళకు 500 టన్నుల బియ్యం పంపాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ అధికారులు కేరళకు కోటి రూపాయల విలువైన 500 టన్నుల బియ్యం పంపిస్తున్నారు.

    100 టన్నుల పశువుల దాణా

    కేరళ రాష్ట్రంలో జీవాల కోసం 100 టన్నుల పశువుల దాణాను తీసుకెళ్లే వాహనాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. దాణాతోపాటు లక్షా 25వేల దోమల వ్యాక్సిన్‌ను వాహనాల్లో తీసుకెళ్లనున్నారు. కేరళ రాష్ట్రప్రజలకు అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలని మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+