ఉర్రూతలూగాల్సిందే: ఒకే వేదికపైకి కెసిఆర్, పవన్!

హైదరాబాద్: ఒకరు రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి అనుకున్నది సాధించిన ఉద్యమ నేత. మరొకరు సినీరంగంలో ఓ వెలుగు వెలుగుతూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న నాయకుడు. వీరిద్దరూ ఒకే వేదికను పంచుకుంటూ ఏ విధంగా ఉంటుంది.వేదిక ఉర్రూతలూగిపోదూ.. వారే తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు, ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.

అయితే వారు కలుసుకునేది మాత్రం రాజకీయ వేదిక కాదు. అది ఓ ఆడియో వేడుక. ఈ ఇద్దరు నేతలు ఆ ఆడియో వేడుకకు హాజరుకాబోతున్నట్లు సమాచారం.

మాజీ ప్రధాని దేవగౌడ మనుమడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా నటించిన తొలి చిత్రం జాగ్వార్. దాదాపు 75 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ సినిమా తెరకెక్కింది. సెప్టెంబర్ 18న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరగబోతోంది.

KCR and Pawan will see in one venue

ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం కుమారస్వామి జనసేన అధినేతతో భేటీ అయ్యారు. ఆడియో విడుదల వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. పవన్ కూడా అంగీకరించినట్లు తెలిసింది. పవన్‌ను కలిసిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కూడా ఆయన భేటీ అయ్యారు.

కేసీఆర్ కూడా ఆడియో విడుదలకు వెళతారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఇద్దరు నేతలూ.. ఒకే వేదికపై కనువిందు చేయనున్నారు. అయితే, ఈ వేడుక కోసం సెప్టెంబర్ 18వరకూ వేచి చూడాల్సిందే మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+