‘రంది పడకు రాజన్నా.. నేనున్నా’: గాయకుడు సుందిళ్ల రాజన్నకు కెసిఆర్ భరోసా(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో తనతో నడిచిన రచయిత, గాయకుడు సుందిళ్ల రాజన్న కుటుంబాన్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్న కుమారునికి వైద్యంతో పాటు ఆయన కుమార్తె వివాహం జరిపిస్తామని చెప్పారు.
‘రంది పడకు రాజన్నా.. నేనున్నా అంటూ' రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. సుందిళ్ల రాజన్నకు భరోసా ఇచ్చారు. బుధవారం సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్‌తో కలిసి కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు.
సుందిళ్ల రాజన్న తన చాంబర్‌లోకి రాగానే సీఎం ఆయనను ఆలింగనం చేసుకున్నారు. పాటల రచయిత, తెలంగాణ ఉద్యమకవి రాజన్న ముఖ్యమంత్రితో తన కష్టాలు చెప్పుకున్నారు. అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
రాజన్న రాగానే ఉద్యమకాలంలో ఆయన రాసిన పాటలను సీఎం జ్ఞాపకం చేసుకున్నారు. రాజన్న రాసిన తెలంగాణ వచ్చేదాక తెగించి కొట్లాడుడే పాట, జాన్‌సే జాదా హైదరాబాద్, జప్పున పోదాం జంగ్‌కు వంటి పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి.
కాగా, తెలంగాణ ఆవిర్భావం అనంతరం సాంస్కృతిక సారథిలో ఆయనకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. అయితే, ఇటీవల రాజన్న కుమారుడు అజయ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కుమార్తె వివాహం నిశ్చయమైనా ఆర్థిక సమస్యల కారణంగా ఇబ్బందుల్లో ఉన్నారు.
రాజన్న దీనస్థితిని విని చలించిన సీఎం.. రాజన్న వెన్ను తట్టారు. ‘రంది పడకు! నీకు నేనున్నాను' అంటూ భరోసా ఇచ్చారు. ఆయన కుమారునికి వైద్యసాయం కోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కుమార్తె వివాహానికి ఆర్థిక సాయం అందిస్తామని, పెళ్లి జరిపిస్తామని చెప్పారు. సీఎం స్పందనకు రాజన్న ఆనందం వ్యక్తం చేశారు. సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులు, వివిధ పథకాలపై చర్చించినట్లు సమాచారం.

రాజన్నకు కెసిఆర్ భరోసా
తెలంగాణ ఉద్యమంలో తనతో నడిచిన రచయిత, గాయకుడు సుందిళ్ల రాజన్న కుటుంబాన్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్న కుమారునికి వైద్యంతో పాటు ఆయన కుమార్తె వివాహం జరిపిస్తామని చెప్పారు.

రాజన్నకు కెసిఆర్ భరోసా
‘రంది పడకు రాజన్నా.. నేనున్నా అంటూ' రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. సుందిళ్ల రాజన్నకు భరోసా ఇచ్చారు. బుధవారం సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్‌తో కలిసి కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు.












Click it and Unblock the Notifications