బిర్యానీ తినిపిస్తా: కెసిఆర్‌తో మహిళ(పిక్చర్స్)
మహబూబ్‌నగర్: ఇచ్చిన మాట ప్రకారం నాలుగున్నర నెలల్లో ఇళ్లు కట్టి చూపిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. నాలుగేళ్లలో మురికివాడలను పూర్తిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని మురికివాడల్లో ఆదివారం ముఖ్యమంత్రి పర్యటించి అక్కడి బస్తీవాసులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని పాతపాలమూరు, వీరన్నపేట, పాతతోట, రైతుబజార్ ప్రాంతాలలో ప్రజలను ఉద్దేశించి సిఎం కెసిఆర్ మాట్లాడారు. ‘అధికారులే మీ దగ్గరికి వస్తారు. మరో ఎనిమిది రోజుల్లో ఇక్కడ ఇండ్ల నిర్మాణానికి పునాదిరాయి వేసేందుకు మళ్లీ వస్తా. నాలుగున్నర నెలల్లో నిర్మాణం పూర్తికాగానే ప్రారంభించడానికి వస్తా' అని సిఎం కెసిఆర్ బస్తీవాసులకు భరోసా ఇచ్చారు. నీటిశుద్ధి ప్లాంట్లు, ఇంటింటికీ నల్లాలు, సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, మరుగుదొడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఆదివారం మధ్యాహ్నం 12.20 గంటలకు పాతపాలమూరు నుంచి ముఖ్యమంత్రి పర్యటన ప్రారంభమైంది. పాతతోట, వీరన్నపేట, రైతుబజార్‌లలో కేసీఆర్ పర్యటించారు. ‘మీకు ఇండ్లు కట్టినాక నేను మిమ్మల్ని ఇండ్లకు పంపించేందుకు వస్త.. అప్పుడు జోర్‌దార్ దావత్ ఇయ్యాలె' అని పాతతోటలో ముఖ్యమంత్రి కెసిఆర్ అనగానే.. ఓ మహిళ బిర్యానీ తినిపిస్తాననడంతో ఆయన చిరునవ్వు నవ్వారు. పాతతోట.. కొత్తతోట కావాలని ఆయన ఆకాంక్షించారు. అక్కడి నుంచి వీరన్నపేట చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడి బస్తీలో కలియతిరిగారు.
మహబూబ్‌నగర్ పట్టణంలో 29 మురికివాడలు ఉన్నాయని, ఏడాదికి ఏడు వాడల చొప్పున అభివృద్ధి చేస్తూ నాలుగేండ్లలో అన్నింటినీ అద్దంలా మారుస్తామని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమాలలో ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కలెక్టర్ శ్రీదేవి, జడ్పీ చైర్మన్ భాస్కర్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్
ఇచ్చిన మాట ప్రకారం నాలుగున్నర నెలల్లో ఇళ్లు కట్టి చూపిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు.

పాతపలమారులో కెసిఆర్
నాలుగేళ్లలో మురికివాడలను పూర్తిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

కెసిఆర్
మహబూబ్‌నగర్ పట్టణంలోని మురికివాడల్లో ఆదివారం ముఖ్యమంత్రి పర్యటించి అక్కడి బస్తీవాసులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొన్నారు.

కెసిఆర్
మున్సిపాలిటీ పరిధిలోని పాతపాలమూరు, వీరన్నపేట, పాతతోట, రైతుబజార్ ప్రాంతాలలో ప్రజలను ఉద్దేశించి సిఎం కెసిఆర్ మాట్లాడారు.

కెసిఆర్
‘అధికారులే మీ దగ్గరికి వస్తారు. మరో ఎనిమిది రోజుల్లో ఇక్కడ ఇండ్ల నిర్మాణానికి పునాదిరాయి వేసేందుకు మళ్లీ వస్తా. నాలుగున్నర నెలల్లో నిర్మాణం పూర్తికాగానే ప్రారంభించడానికి వస్తా' అని సిఎం కెసిఆర్ బస్తీవాసులకు భరోసా ఇచ్చారు.

కెసిఆర్
నీటిశుద్ధి ప్లాంట్లు, ఇంటింటికీ నల్లాలు, సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, మరుగుదొడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

కెసిఆర్
ఆదివారం మధ్యాహ్నం 12.20 గంటలకు పాతపాలమూరు నుంచి ముఖ్యమంత్రి పర్యటన ప్రారంభమైంది.

కెసిఆర్
పాతతోట, వీరన్నపేట, రైతుబజార్‌లలో కేసీఆర్ పర్యటించారు.

కెసిఆర్ బిర్యానీ ఆఫర్
‘మీకు ఇండ్లు కట్టినాక నేను మిమ్మల్ని ఇండ్లకు పంపియనీకె వస్త.. అప్పుడు జోర్‌దార్ దావత్ ఇయ్యాలె' అని పాతతోటలో ముఖ్యమంత్రి కెసిఆర్ అనగానే.. ఓ మహిళ బిర్యానీ తినిపిస్తాననడంతో ఆయన చిరునవ్వు నవ్వారు.

కెసిఆర్
పాతతోట.. కొత్తతోట కావాలని ఆయన ఆకాంక్షించారు. అక్కడి నుంచి వీరన్నపేట చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడి బస్తీలో కలియతిరిగారు.

కెసిఆర్
మైనారిటీ కార్పొరేషన్ కింద నిధులు ఉన్నాయని, అర్హులైనవారు స్వయంఉపాధి పొందేందుకు రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు.

కెసిఆర్
వార్డులోని మహిళా సంఘాల సభ్యులు అందరూ కలిసి ఇండ్లు కట్టుకునేందుకు ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆర్థికంగా ప్రజలు ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ముఖ్యమంత్రి
మరో పది రోజుల్లో మురికివాడల్లో బోర్లు లేకుంటే బోర్లు వేయించడం, బోర్లు ఉన్న బస్తీలలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.












Click it and Unblock the Notifications