• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల ఆత్మహత్యలకు కేసీఆరే బాద్యుడు.!ధరిణి పనికిమాలిన పోర్టల్.! మండిపడ్డి షర్మిళ.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా రైతుల ఆత్మహత్యలు ఏమాత్రం ఆగడం లేదని ఇది వందకు వంద శాతం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వైఫల్యమని తెలంగాణ వైయస్సార్ పార్టీ అధినేత్రి శ్రీమతి షర్మిళ ధ్వజమెత్తారు. వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం, ధరణి పోర్టల్ లో భూముల నమోదు సమస్యలు, అన్నీ కలిపి రైతుల ఆత్మహత్యలకు దారి తీసు్తున్నాయని, ఇవన్నీ ముమ్మాటికీ చంద్రశేఖర్ రావు హత్యలేనని వైయస్ షర్మిల ఆరోపించారు. ధరణి పోర్టల్ లో భూమి లేదని అధికారులు చెప్పడంతో చింతల స్వామి అనే రైతు మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడ్డారు. మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం దండుపల్లి గ్రామంలో చింతల స్వామి కుటుంబాన్ని వైయస్ షర్మిళ పరామర్శించారు.

తెలంగాణలో కొనసాగుతున్న ఆత్మహత్యలు.. సీఎం ఇలాకాలో ఆత్మహత్యలు జరగడం సిగ్గుచేటన్న షర్మిళ

తెలంగాణలో కొనసాగుతున్న ఆత్మహత్యలు.. సీఎం ఇలాకాలో ఆత్మహత్యలు జరగడం సిగ్గుచేటన్న షర్మిళ

సీఎం చంద్రశేఖర్ రావు సొంత నియోజకవర్గం గజ్వెల్ లో చింతల స్వామి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, స్వామికి భార్యా, ఇద్దరు కొడుకులు ఉన్నారని, అధికార పార్టీ తీసుకువచ్చిన ధరణీ పోర్టల్ తో స్వామికి సంబంధించిన భూమి చూపించడం లేదని, చింతల స్వామి తండ్రి నర్సయ్య భూమి కోసం ఏడాది కిందట అధికారుల చుట్టూ తిరిగి ఆకరికి చనిపోయాడని షర్మిళ ఆవేదన వ్యక్తం చేసారు. రైతు నర్సయ్య చనిపోయి సంవత్సరం అవుతున్నా భూమి సమస్యను అధికారులు పరిష్కరించలేదని, సర్పంచ్ లతో సహా అందరికీ ఈ సమస్య తెలుసని, సాక్షాత్తూ సీఎం నియోజకవర్గంలో కూడా రైతులు ధరణి పోర్టల్ లో భూమి కోసం చనిపోతే, సమస్యను పరిష్కరించలేని దౌర్బాగ్యపు స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందని ఘాటుగా స్పందించారు షర్మిళ.

తప్పుల తడక ధరణి పోర్టల్.. ఎందుకు తెచ్చారో సీఎం చెప్పాలన్న షర్మిళ

తప్పుల తడక ధరణి పోర్టల్.. ఎందుకు తెచ్చారో సీఎం చెప్పాలన్న షర్మిళ

అంతే కాకుండా చింతల స్వామి కూడా ఇదే భూమి కోసం అధికారుల చుట్టూ తిరిగాడని, అధికారులు భూమి లేదని చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడని, ఇంటికి వచ్చి లేఖ రాసి ఉరి వేసుకుని చనిపోయాడని షర్మిళ వివరించారు. ధరణి పోర్టల్ సమస్యతో ఈ కుటుంబంలో ఇద్దరు చనిపోయారని, ఒకే ఇంట్లో ఇద్దరి ప్రాణాలను తీసింది ధరణి పోర్టల్ అని ఆందోళన వ్యక్తం చేసారు షర్మిల. భూమి సమస్య పరిష్కారమౌతుందన్న నమ్మకం స్వామి పిల్లలకు లేదని, అధికార పార్టీ నిరంకుశ పాలనతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంకావలని షర్మిళ ప్రశ్నించారు.

రైతు ఆత్మహత్యలకు కేసీఆర్ బాద్యుడు.. నష్టపరిహారం చెల్లించాలన్న వైసిపి నాయకురాలు

రైతు ఆత్మహత్యలకు కేసీఆర్ బాద్యుడు.. నష్టపరిహారం చెల్లించాలన్న వైసిపి నాయకురాలు

ఇదిలా ఉండగా కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందనట్టుగా ముఖ్యమంత్రి చంద్రవేఖర్ రావు వ్యవమారం ఉందని షర్మిళ మండి పడ్డారు. ఎవరి కోసం ధరణి పోర్టల్ తీసుకువచ్చారని? ఎవరికి మేలు చేయడానికి ధరణి పోర్టల్ ను కొనసాగిస్తున్నారని.? షర్మిళ సూటిగా నిలదీసారు. దండుపల్లిలో చాలా మంది రైతులకు ధరణి పోర్టల్ లో భూమి సమస్య ఉందని ఫిర్యాదులు చేస్తున్నారని, ఇంత జరుగుతున్నా అధికార పార్టీ ఏం చేస్తుందని మండిపడ్డారు. సమస్యలను పరిష్కరిచంకుండా ఇంత మంది ఆఫీసర్లు ఉండి ఏం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో సమస్యలు ఈ స్థాయిలో ఉంటే చంద్రశేఖర్ రావు స్పందించకుండా ఫాం హౌస్ లో పడుకుని నిద్ర పోతున్నాడా అని షర్మిళ ధ్వజమెత్తారు.

ఒకే కుంటుంబంలో ఇద్దరు ముడ్డురు ఆత్మహత్యలు..ఇంత కఠిన సీఎం ఎక్కడా ఉండరన్న షర్మిళ

ఒకే కుంటుంబంలో ఇద్దరు ముడ్డురు ఆత్మహత్యలు..ఇంత కఠిన సీఎం ఎక్కడా ఉండరన్న షర్మిళ

ఒకే ఇంట్లో ఒకే సమస్యతో ఇద్దరు రైతులు చనిపోతే ఒక్క అధికారి అయినా వచ్చి స్వామి కుటుంబాన్ని పరామర్శించారా.? స్వామి కుటుంబానికి ఏం సాయం కావాలని ఒక్కరైనా అడిగారా..? ఇంత వరకు అధికారులు ఎవరైనా నష్టపరిహారం అందచేశారా..? అని నిలదీసారు షర్మిళ. నర్సయ్య చనిపోయి సంవత్సరం కావస్తున్నా ఆయన భార్యకు పింఛన్ కూడా ఇవ్వలేదని, వృద్దురాలయిన ఆ తల్లి ఎలా బతుకుతుందని, చంద్రశేఖర్ రావు పొంత నియోజకవర్గంలో ఇలా అయితే వేరే నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందని షర్మిళ నిలదీసారు. ముఖ్యమంత్రిని అని చెప్పుకునేందుకు చంద్రశేకర్ రావుకు సిగ్గుండాలని, సొంత నియోజకవర్గంలో ఒక్కరిని కూడా ఆదుకోని ముఖ్యమంత్రి ఏం పాలన చేస్తున్నట్టని, ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అని షర్మిళ నిలదీసారు.

సీఎంకు ఇంగితముంటే 50లక్షలు ఇవ్వాలి.. స్వామి కుటుంబాన్ని ఆదుకోవాలన్న షర్మిళ

సీఎంకు ఇంగితముంటే 50లక్షలు ఇవ్వాలి.. స్వామి కుటుంబాన్ని ఆదుకోవాలన్న షర్మిళ

చంద్రశేఖర్ రావు కోట్లకు కోట్లు కమీషన్లు మింగుతున్నప్పటికి పేదల భూమలను కూడా మిగల్చడం లేదని, ఎంత మంది నిరుపేదలను పొట్టన పెట్టుకుంటరని షర్మిళ ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికీ చంద్రశేఖర్ రావు చేసిన హత్యలుగా తెలంగాణ వైసీపి భావిస్తోందని అన్నారు. చంద్రశేఖర్ రావు తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఈ పాపం పోదని, కనీసం బతికున్న వాళ్లనైనా ఆదుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం ఇంగితమున్నా 50 లక్షల రూపాయలు స్వామి కుటుంబానికి నష్టపరిహారంగా అందజేయాలని డిమాండ్ చేసారు షర్మిళ.

English summary
Even after the formation of Telangana as a separate state, the suicides of farmers did not stop at all.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X