కేసీఆర్ చరిత్ర మొత్తం అబద్దాలు,మాయ మాటలే.!మీటర్ల అంశంలో సీఎంది తప్పుడు ప్రచారమన్న బండి సంజయ్.!

నల్గొండ/హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అబద్దాలకు తాజా నిదర్శనం మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని గ్లోబల్స్‌ ప్రచారం చేయడమని తెలంగాణ బీజేపి అద్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న మాట నిజమైతే వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి లేదా లై డిటెక్టర్‌ టెస్ట్‌ కు చంద్రశేఖర్ రావు సిద్ధమా? బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా తాను సిద్ధం అన్నారు బండి సంజయ్. చంద్రశేఖర్ రావు తియ్యగా చెప్పే అబద్ధాలు, మాయ మాటలు, అహంకారంతో ముడిపెట్టే వెటకారాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం జబర్దస్త్ కామెడీ షో లాగా చూస్తున్నారని తెలిపారు.

 మీటర్ల అంశంలో లై డిటెక్టర్ టెస్టుకు కేసీఆర్ సిద్దమా.?బండి సంజయ్ సూటి ప్రశ్న

మీటర్ల అంశంలో లై డిటెక్టర్ టెస్టుకు కేసీఆర్ సిద్దమా.?బండి సంజయ్ సూటి ప్రశ్న


మునుగోడు బహిరంగ సభలో చంద్రశేఖర్ రావు మాట్లాడిన మాయ మాటలు, అబద్ధాలు అన్నీ ఇన్నీ కావన్నారు బండి సంజయ్. ఆయన గారడి మాటలన్నింటికీ తెలంగాణ ప్రజల తరఫున సమాధానం చెప్పడానికి, బహిరంగ చర్చకు బిజెపి తెలంగాణ శాఖ సిద్ధంగా ఉందన్నారు బండి సంజయ్. మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరమే లేదని బిజెపి తెలంగాణ శాఖ నిరూపిస్తుందని, అందుకు తగ్గ ఆధారాలను చూపిస్తామని, తాము చూపెట్టే ఆధారాలను చూసిన తరువాత తప్పయిందని చంద్రశేఖర్ రావు , టీఆర్‌ఎస్‌ నాయకులు ఒప్పుకుని ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతారా? అని బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ టీఆర్‌ఎస్‌ తమది తప్పని నిరూపిస్తే... బిజెపి తెలంగాణశాఖ దేనికైనా సిద్ధమే అన్నారు. బిజెపి తెలంగాణ శాఖ సవాల్‌ కు అంగీకరించాలని చంద్రశేఖర్ రావు , టీఆర్‌ఎస్‌ పార్టీని డిమాండ్‌ చేస్తున్నామన్నారు బండి సంజయ్.

 బీజేపి అధికారిక రాష్ట్రాల్లో మీటర్లు అమర్చిందా..? కేసీఆర్ చెప్పాలన్న బండి సంజయ్

బీజేపి అధికారిక రాష్ట్రాల్లో మీటర్లు అమర్చిందా..? కేసీఆర్ చెప్పాలన్న బండి సంజయ్


బిజెపి వస్తే వ్యవసాయ క్షేత్రాల్లో మీటర్లు పెడ్తారని రైతులను చంద్రశేఖర్ రావు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారన్నారు బండి సంజయ్. ఇప్పటికే దేశంలో 17 రాష్ట్రాల్లో బిజెపి -ఎన్డీఏ ప్రభుత్వం ఉందని, అక్కడ రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు ఆధారాలు చంద్రశేఖర్ రావు చూపించగలరా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. మునుగోడులో ప్రజలు టీఆర్‌ఎస్‌ ఫ్యూజు పీకేస్తే, ఫామౌజ్‌ లో చంద్రశేఖర్ రావు మోటర్‌ ఆగిపోతుందని ఎద్దేవా చేసారు. నాలుగొందల ఎకరాల ఫామౌజ్‌ కు ఎంత కరెంటు వాడుకుంటున్నరు? ఎంత కరెంటు బిల్లు కడుతున్నారో తెలంగాణ ప్రజలకు లెక్క జెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు బండి సంజయ్.

 కేసీఆర్ ది తప్పుడు ప్రచారం.. ప్రజలు నమ్మొద్దన్న బీజేపి ఛీఫ్

కేసీఆర్ ది తప్పుడు ప్రచారం.. ప్రజలు నమ్మొద్దన్న బీజేపి ఛీఫ్


వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరమే లేదని, కేంద్రం చేసిన చట్టంలో యాక్ట్‌ కాపీలో స్పష్టంగా ఉందని, అయినా గ్లోబల్స్‌కు వారసుడైన చంద్రశేఖర్ రావు అబద్దాలు చెప్తూనే ఉంటారన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలనే చంద్రశేఖర్ రావు ఆలోచన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, అసలు ఉచిత కరెంట్‌ ఇయ్యడం చంద్రశేఖర్ రావు కు చేతగావడం లేదన్నారు బండి సంజయ్. ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని, ప్రభుత్వం దగ్గర నిధులు లేవని, ఉచితంగా కరెంట్‌ ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు. మాటకు ముందు, మాటకు వెనక తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నా అంటున్నరని, వానాకాలం సాగుమొదలైనప్పటి నుండి 24 గంటల కరెంటు ఇస్తున్నామని గప్పాలు కొట్టుకుంటున్న ప్రభుత్వం కరెంటు సరఫరాలో అంతరాయాల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

 అబద్దాలకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్.. సీఎం పై బండి సంజయ్ ఆగ్రహం

అబద్దాలకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్.. సీఎం పై బండి సంజయ్ ఆగ్రహం

తెలంగాణ ప్రజలకు తన బండారమంతా బయటపడుతుందని గ్రహించిన చంద్రశేఖర్ రావు ఆ తప్పును కేంద్రం మీద నెట్టాలనుకుంటున్నరని బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ కు ఓటేయకుంటే మీటర్లు పెట్టడం ఖాయమని రైతులను బ్లాక్‌ మెయిల్‌ చేసే స్థాయికి చంద్రశేఖర్ రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు దిగజారారన్నారు బండి సంజయ్. దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇదే విధమైన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపైన గ్లోబల్స్‌ ప్రచారం చేసి రైతులను మభ్యపెట్టాలని చూశారని, విజ్ఞులైన రైతులు చంద్రశేఖర్ రావు మాయమాటలు నమ్మకుండా టీఆర్‌ఎస్‌కు తగిన రీతిలో బుద్దిచెప్పారన్నారు. నిజం చెప్పకూడదనే శాపం కారణంగా తన పంథాలోనే నడుస్తూ నిత్యం అబద్ధాలు వల్లిస్తూ తెలంగాణ ప్రజలను, రైతాంగాన్ని మోసం చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని సీఎంపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+