ఎన్టీఆర్‌కే ఓటమి తప్పలేదు, హరీష్ కాపాడుకుంటున్నారు: కెసిఆర్

హైదరాబాద్‌: ఎన్టీఆర్ అంతటివాడికే ఓటమి తప్పలేదని, ప్రభుత్వంపై వ్యతిరేకత సహజమని, అధికారంలో ఏ పార్టీకైనా ఈ పరిస్థితి తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీఆర్‌ ప్రభంజనంతో గెలిచిందనిస, అయితే ప్రభుత్వ పనితీరు సరిగా లేకపోవడం వల్ల ఆ పార్టీ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిందని ఆయన అన్నారు. కాబట్టి పనితీరు బాగుండాలని, నోటి దురుసు ఉండకుండా చూసుకోవాలని సూచించారు.

ఉత్తమంగా పనిచేసినా నోటి దురుసుంటే ప్రమాదం తప్పదని ఆయన అన్నారు. మెదక్‌ జిల్లా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి ఉదంతాన్ని ఆయన ఉదహరించారు. ముత్యంరెడ్డి చాలా మంచివాడని, మంచి పనివాడని, కానీ, నోటి దురుసు ఉండడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయాడని ఆయన పార్టీ నేతలకు చెప్పారు. బుధవారం టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.

KCR says even NTR defeated, it is natural

క్షేత్ర స్థాయిలో పార్టీకి చెందిన అందరినీ కలుపుకొని వెళ్లాలని, ఎవరు చేసే పనులు వారు చేయాలని, అంతా ప్రజల్లో మమేకం కావాలని సూచించారు. అందరితో మంచిగా ఉండాలని, ఎవరు ఏది చెప్పినా ఓపిగ్గా వినాలని, అర్థం చేసుకోవాలని సూచించారు. కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు మధ్య దూరం పెరుగుతున్నట్లు తనకు సమాచారం అందిందని, దానిని సర్దుబాటు చేసుకోవాలని చెప్పారు.

లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగకపోతే, భవిష్యత్తు ఉండదని స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో గెలవటానికి ఇబ్బంది పడాల్సి వస్తుందనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. గెలుపు అన్నది మన చేతుల్లోనే ఉంటుందని, పనిచేసిన వారినే ప్రజలు గెలిపిస్తారని ఆయన నేతలకు సూచించారు. ప్రజల్లోనే ఉండాలని, అవసరమైతే గ్రామాల్లోనే నిద్రించాలని చెప్పారు.

KCR says even NTR defeated, it is natural

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్కో ఊళ్లో ఎనిమిది సార్లు నిద్రించిన సందర్భాలూ ఉన్నాయని చెప్పారు. అలా ఉండడం వల్లే దాదాపు 30 ఏళ్లుగా వివిధ పదవుల్లో కొనసాగగలుగుతున్నానని చెప్పారు. ఎన్నికలైన ప్రతి సారీ ప్రతి బూత్‌లోనూ మెజారిటీ వచ్చేదని, ఇప్పుడు దానిని హరీశ్‌రావు కాపాడుకుంటున్నారని ఆయన అన్నా రు. టిఆర్ఎస్ఎల్పీ సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్లను ప్రత్యేకాహ్వానితులుగా పిలిచారు. ఈ సమావేశంలో కెసిఆర్ పలు విషయాలపై మాట్లాడారు. శాసనసభ్యులకు, మంత్రులకు మార్గనిర్దేశం చేశారు.

గ్రామజ్యోతిపై అభిప్రాయాలను చెప్పాలని సీఎం కోరగా, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌ మాట్లాడారు. వరంగల్‌ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఆశిస్తున్న ప్రొఫెసర్‌ సాంబయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+