వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి చెందిన ఆనంద్ సాయి సహా...: కెసిఆర్ ఆదేశాలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యాదాద్రి దేవస్థానం అభివృద్ధికి రూపమిచ్చిన ప్రణాళికలను వేగంగా అమలు చేయాలని, వారం పది రోజుల్లో పనులను ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కావాల్సినంత భూమి, నిధులు ఉన్నందున వెంటనే కార్యాచరణ చేపట్టాలన్నారు.

బుధవారం కెసిఆర్ తన నివాసంలో ఆయన దాదాపు అయిదు గంటలపాటు యాదాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ, రూప శిల్పులు జగన్‌, ఆనంద్‌సాయి తదితరులు పాల్గొన్నారు.

గుట్ట చుట్టూ ఇప్పటికే 945.2 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, మరో వందెకరాలు సేకరించి, మొత్తాన్ని ఆలయ అభివృద్ధికే కేటాయిస్తామన్నారు. గుట్టకు రెండేళ్ల బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించామని, దీనికితోడు టాటా, అంబానీలతో పాటు జెన్‌కో, భెల్‌ వంటి సంస్థలు రూ.500కోట్లను విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చాయన్నారు.

యాదాద్రి

యాదాద్రి

యాదాద్రి గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటకకేంద్రంగా మారాలని, ప్రస్తుతం గుట్టపై 15 ఎకరాల స్థలం ఉందని, వీటిలో అయిదు ఎకరాలు ప్రధాన ఆలయానికి వస్తుందని, ఇందులోనే ప్రాకారం, మాఢవీధులు నిర్మించాలని, లక్ష్మీనర్సింహస్వామి 32 అవతారమూర్తులు ఇందులోనే ఉండాలని చెప్పారు.

యాదాద్రి

యాదాద్రి

యాదాద్రి గుట్ట విస్తీర్ణం దాదాపు 180 ఎకరాలని, దీన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు.గుట్ట చుట్టూ గిరిప్రదక్షిణ రోడ్డును నిర్మించాలన్నారు.

యాదాద్రి

యాదాద్రి


గుట్ట పైనే పుష్కరిణి, కళ్యాణకట్ట, అర్చకుల నివాసగృహాలు, రథమండపం, క్యూ కాంప్లెక్స్‌, వీపీఐ అతిథి గృహం, దేవుని ప్రసాదాలు తయారు చేసే వంటశాల, అద్దాల మందిరం నిర్మించాలని, గుట్ట కింది భాగంలో బస్‌స్టాండ్, కళ్యాణమంటపం, దుకాణాల సముదాయం, పూజలకు ఉపయోగించే చెట్ల పెంపకానికి ఉద్యానవనం ఏర్పాటు చేయాలి. మండలదీక్షలు తీసుకునేవారి కోసం వసతికేంద్రాలు నిర్మించాలన్నారు.

 యాదాద్రి

యాదాద్రి

యాదాద్రి చుట్టూ ఉన్న ఇతర కొండలు, ఖాళీ ప్రదేశాల్లో ఉద్యానవనాలు, కాటేజీలు, అతిథి గృహాలు, పార్కింగు స్థలాలు, గోశాల, అన్నదాన భోజనశాల, శాశ్వత హెలిప్యాడ్‌ను నిర్మించాలన్నారు.

యాదాద్రి

యాదాద్రి


బస్వాపూర్‌ రిజర్వాయర్‌ యాదాద్రికి సమీపంలోని బస్వాపూర్‌ చెరువును రిజర్వాయర్‌గా మారుస్తామని, నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అక్కడే బోటింగు, జల క్రీడలను ఏర్పాటు చేయాలన్నారు.

యాదాద్రి

యాదాద్రి


కట్టను హైదరాబాద్‌ ట్యాంక్ బండ్‌ మాదిరి తీర్చిదిద్దాలని, గుట్ట ప్రాంతమంతా నాలుగు వరసల రహదారి ఏర్పడాలని, ప్రతీ రహదారికి డివైడర్‌, కాలిబాట విధిగా ఉండాలని, అధ్యాత్మికం, ఆహ్లాదం, ఆనందం, పచ్చదనం వెల్లివిరిసేలా యాదాద్రి రూపుదిద్దుకోవాలని, వేయి ఎకరాల స్థలాన్ని జోనింగు చేసి, లేఅవుట్‌ను సిద్ధం చేయాలన్నారు.

యాదాద్రి

యాదాద్రి


యాదాద్రికి సమీపంలోని 11ఎకరాల స్థలంలో మూడు అతిథిగృహాలను నిర్మించాలని, పుష్కరిణిని విస్తరించాలని, గుట్ట సమీపంలోని దేవాలయాలను అభివృద్ధి చేయాలని, పాత యాదగిరిని అంతా సందర్శించుకునేలా సౌకర్యాలు కల్పించాలని సీఎం సూచించారు.

యాదాద్రి

యాదాద్రి

యాదాద్రి దేవస్థానం అభివృద్ధికి రూపమిచ్చిన ప్రణాళికలను వేగంగా అమలు చేయాలని, వారం పది రోజుల్లో పనులను ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

English summary
Chief Minister K. Chandrasekhar Rao directed ministers and officials to expedite development work on the Yadadri temple as the money and land had been mobilised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X