తమాషా:ఓయుపై కేసీఆర్‌కి కోపమొచ్చింది(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కోపం వచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 11 ఎకరాలు తీసుకొని పేదలకు ఇళ్లు కట్టిస్తామని ఆయన ప్రకటించారు. దీనిపై విపక్షాలు, విద్యార్థులు భగ్గుమన్నారు.
దీనికి కేసీఆర్ సోమవారం తీవ్రంగా స్పందించారు. హైదరాబాదులోని విశ్వవిద్యాలయాల స్థలాలు తీసుకొని పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని పునరుద్ఘాటించారు. ఆయన సికింద్రాబాద్ హమాలీ బస్తీలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఏం తమాషాగా ఉందా, విశ్వవిద్యాలయాలు ఏమైనా రాజదర్భారులా, వర్సిటీ స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామని, ఇది ప్రజాస్వామ్యమని చెప్పారు. హైదరాబాద్‌లో వ్యవసాయ, ఓపెన్, ఓయు వర్సిటీల్లో భూమి ఉందని, అవేమన్నా మహారాజుల గదులా అని ప్రశ్నించారు. తమాషానా నాకు అర్థం కావడం లేదు. అవి ప్రజల సొత్తు అన్నారు.

కేసీఆర్
పేదల ఇళ్ల కోసం స్థలం ఎందుకు దొరకదు? మూడు వర్సిటీల్లో జాగా ఉందని, ఉస్మానియా యూనివర్సిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఓపెన్ యూనివర్సిటీల్లో కావాల్సినంత స్థలం ఉందని, ఆ జాగాలను తీసుకుని పేదల కోసం ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. ఓయూ క్యాంపస్‌కు సంబంధంలేని భూములను ఇళ్ల కోసం వినియోగిస్తామని, సీసీఎంబీ, ఎన్‌జీఆర్‌ఐకి చెందిన 70-80 ఎకరాల్లోనూ ఇళ్లు కట్టించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

కేసీఆర్
గుర్రపు పందేలకు, గోల్ఫ్‌కోర్సులకు, క్లబ్బులకు స్థలాలు దొరుకుతున్నప్పుడు పేదల ఇళ్ల కోసం స్థలాలు ఎందుకు దొరకవన్నారు? హమాలీబస్తీ పైన కేసీఆర్ వరాలజల్లు కురిపించారు. ఆరు అంతస్థులు, దానికో లిఫ్టు, ఆ భవనంలో ఫ్లాట్లు, ఒక్కో దాంట్లో రెండు బెడ్‌రూంలు, ఓ హాలు, వంటగది, రెండు మరుగుదొడ్లు, ఇంటింటికి నల్లా కనెక్షన్ స్వచ్ఛమైన గాలి, వెలుతురు, వివిధ కార్యక్రమాల కోసం దానికో కమ్యూనిటీ హాలు, వాహనాల కోసం పార్కింగ్ సౌకర్యం.... ఇవన్నీ హమాలీబస్తీవాసులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన వరాలు.

కేసీఆర్
బస్తీవాసులు అంగీకరించడమే ఆలస్యం బుధవారం ఉదయమే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కూడా చేసేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కేవలం ఐదు నెలల్లో ఐడీహెచ్ కాలనీలో వాటిని నిర్మించి బస్తీవాసులకు అందజేసి పేదలు తలెత్తుకు బతికేలా చేస్తానని కేసీఆర్ మాటిచ్చారు. ఆదివారం స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొని తిరిగి వెళుతుండగా బస్తీ కనిపించిందని, అక్కడి పరిస్థితులు చూసి తన మనసు చలించిందని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్
కాబట్టి ఇక్కడి ప్రాంతాన్ని నివాస ప్రాంతంగా మార్చడానికి నిర్ణయించుకున్నానని వివరించారు. అయితే హమాల్‌బస్తీలో ఎన్ని కుటుంబాలున్నాయో లెక్క తేలడం లేదని, రకరకాలుగా చెబుతున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం ఎకరన్నర స్థలం అందుబాటులో ఉందని, 144 కుటుంబాలు నివసిస్తున్నట్లు, 69 మంది అన్నదమ్ములున్నట్లు, 8 ఇళ్లకు తాళం పెట్టినట్లు, వివిధ కారణాల వల్ల రెండు ఇళ్లను కూల్చేసినట్లు ఆయన చెప్పారు.

కేసీఆర్
భవనంలో నిర్మించే లిఫ్ట్ విద్యుత్ బిల్లుల్ని చెల్లించేందుకు 7 నుంచి 10 మడిగెలు నిర్మిస్తే ఆదాయం వస్తుందని, దానిని కరెంటుకు వెచ్చిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఒక్కో ఇంటికి సుమారు 9 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. ఆ ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని, బస్తీలోని పేదలంతా ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన వరాలు కురిపించారు.

కేసీఆర్
ఇది ప్రజాస్వామ్య.. ప్రజల యుగమని, పేదవాళ్లు ఊరవతల జీవించాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక మీదట పేదలకు డబ్బా ఇళ్లు ఉండబోవని, ఆ బాధలన్నీ తీరుస్తానని అన్నారు. ఆడపిల్లలు బట్టలు మార్చుకోవడానికీ ఇక ఇబ్బంది ఉండదన్నారు. ఇంటికి చుట్టం వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలగదన్నారు.

కేసీఆర్
బస్తీవాసులు సమష్టిగా కలిసిమెలిసి జీవించాలని, పంచాయితీలు తగ్గించుకోవాలని కేసీఆర్ సూచించారు. కమిటీగా ఏర్పడి ఇళ్ల నిర్మాణ పనులు పర్యవేక్షించాలని, తానూ ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు.

కేసీఆర్
చాలామంది ఇల్లు లేదు కావాలంటున్నారని, తప్పకుండా కట్టిస్తామని సోమవారం మెట్టుగూడ భవనంలో సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన వివిధ విభాగాల అధికారులతో సమావేశంలో కేసీఆర్ పేర్కొన్నారు. ఉన్న చోట కాకున్నా సొంతిల్లు లేని ప్రతి కుటుంబానికీ ఖాళీ జాగాల్లో రెండు పడకల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

కేసీఆర్
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే బస్తీల పరిస్థితులు దుర్భరంగా తయారయ్యాయని పేర్కొన్నారు. ఓ పద్ధతి, ప్రణాళిక అంటూ లేకుండా ఇళ్లు నిర్మించుకుంటూ పోయారని, అగ్గిపెట్టెలు పక్కపక్కన పెట్టినట్టు ఉండడంతో ఏ పని చేద్దామన్నా ఖాళీ స్థలం దొరకడం లేదన్నారు.

కేసీఆర్
స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా నగరంలో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పార్శిగుట్ట నుంచి వస్తూ ముషీరాబాద్‌లోని కృష్ణానగర్‌ను సందర్శించారు. అక్కడ కేవలం 412 గజాల్లో 12 చిన్న గదులు కట్టుకొని ఉంటున్న 46కుటుంబాల పరిస్థితిని గమనించారు.

కేసీఆర్
కాళ్లు చాపుకుని పడుకునేందుకు వీలు లేని జీవితం గడపుతున్న వారి దీనస్థితిని చూసి కేసీఆర్ చలించిపోయారు. వారితో మాట్లాడగా, ఆటో నడుపుతామని, భవనాలకు పెయింటింగ్ వేస్తామని, ఇళ్లలో పనిచేసుకొని బతుకుతామని చెప్పారు. వెంటనే ఆ స్థలంలో టవర్ నిర్మించి వారికి ఇల్లు కట్టించి ఇవ్వాలని ఆదేశించారు.

కేసీఆర్
412 గజాల స్థలంలో అందరికీ సరిపడా ఇల్లు కట్టడం సాధ్యం కాదని భావించి, పక్క ఇంటి యజమాని సత్యానంద్‌తో స్వయంగా మాట్లాడారు. పేదల కోసం కొంత వారి ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. అందుకు ప్రతిఫలంగా తగిన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.

కేసీఆర్
అందుకు ఒప్పుకున్న సత్యానంద్‌ను కేసీఆర్ అభినందించారు. ఈ ప్రాంతాన్ని మంగళవారం సర్వే చేసి, సాయంత్రానికి నివేదిక ఇవ్వాలని, బుధవారం శంకుస్థాపన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

కేసీఆర్
హైద్రాబాద్ దశ మారాలి.. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులకు మార్గనిర్దేశం చేశారు. సోమవారం మెట్టుగూడలోని ఆర్టీసి గెస్ట్‌హౌస్‌లో స్వచ్ఛ హైద్రాబాద్ 12 యూనిట్ల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications