గూఢచారులుంటారు.. నివేదికలిస్తారు.. అయితే.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ సంచలనం!!
తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో గత ప్రభుత్వం పైన సంచలన ఆరోపణలు వెల్లువగా మారిన విషయం తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని, రాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ చేయించారని, ఈ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉందని పదే పదే విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టుకు బీఆర్ఎస్
ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్న క్రమంలో, అనేక సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కావాలనే బీఆర్ఎస్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు హైకోర్టును కూడా ఆశ్రయించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేసీఆర్
ఎన్నికల సమయంలో కావాలని తమ పార్టీని అభాసుపాలు చేయడంలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని, ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రచారానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇక తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఓ మీడియా సంస్థకు చెందిన దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.
గూఢచారులు ఉంటారు .. నివేదికలిస్తారు.. అయితే
ప్రభుత్వానికి గూఢచారులు ఉండడం, వారు నివేదికలు ఇవ్వడం అత్యంత సహజమైన పరిణామమని అన్నారు. రిపోర్టులను ఏం చేసి తీసుకువచ్చారు అనేది తమకు ఎలా తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు సీఎంతో పాటు ఇతర మంత్రుల చేతికి రిపోర్టులు వస్తాయని, గూఢచారుల నుంచి రిపోర్టులు తీసుకున్నంత మాత్రాన ఫోన్ ట్యాపింగ్ చేయించినట్టా అని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ తో మాకేం సంబంధం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తమ పరిధిలోకి రాదని, దాంతో మాకేం సంబంధం అంటూ ప్రశ్నించిన కేసీఆర్ ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత తెలివి తక్కువ తనంగా ఆలోచిస్తుందని తాము అనుకోలేదన్నారు. పదేళ్ల తమ పాలనలో అద్భుతాలు సృష్టించామని, కేవలం ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలను రాచి రంపాన పెడుతున్నారని విమర్శించారు.
భవిష్యత్ లో మాదే కీ రోల్
పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో అనిశ్చితి వస్తుందని, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరుతుందని అన్నారు. ఇక ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలను సంపాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో తాము కీ రోల్ పోషిస్తామని చెప్పారు కెసిఆర్.
-
విద్యుత్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట!












Click it and Unblock the Notifications