అగ్నిప్రమాద ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి: బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా!!
ఖమ్మం జిల్లా కారేపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం అగ్ని ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందడం పలువురు గాయపడటం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఊహించని రీతిలో గ్యాస్ సిలిండర్లు పేరు ఇద్దరు కార్యకర్తలు మరణించడం పలువురికి తీవ్ర గాయాలు కావడం తెలిసి ఆవేదన చెందానని కెసిఆర్ వెల్లడించారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు, ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ఉన్న ఎంపీ నామా నాగేశ్వరరావు లకు ఫోన్ చేసి సీఎం కేసీఆర్ ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన కేసీఆర్ పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను, క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తన తరపున చనిపోయిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

చీమలపాడు అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు, క్షతగాత్రులకు రెండు లక్షల సాయాన్ని ఇస్తూ వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చులు కూడా భరించనున్నట్టు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications