Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం నువ్వా నేనా రేవంత్; నిరోధ్ లు అమ్ముకోమంటారా కుక్కల కొడుకుల్లారా: విరుచుకుపడ్డ కేసీఆర్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి దృశ్యాలు కనిపించాయో అవే పరిస్థితులే కనిపిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండని జిల్లా లేదని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల పరిస్థితి ఇలా ఉందని ఆయన పేర్కొన్నారు.

తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్
ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కెసిఆర్ కుక్కల కొడుకులంటూ మండిపడ్డారు. రైతుబంధు అడిగితే ఓ మంత్రి చెప్పుతో కొడతానని చెబుతున్నారని, సిరిసిల్లలో బతుకమ్మ చీరల ఆర్డర్ల గురించి అడిగితే ఒక కాంగ్రెస్ నాయకుడు నిరోధ్ లు అమ్ముకుని బతకాలని చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు నిరోధ్ లు అమ్ముకుని బ్రతకాలా.. కుక్కల కొడుకుల్లారా అంటూ విరుచుకుపడ్డారు.

kcr shocking comments on revanth reddy and congress leaders over telangana drought

లత్కోరులు, అసమర్థులు.. కేసీఆర్ ఆగ్రహం
చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బ తీస్తే చూస్తూ ఊరుకోబోమని చేనేతకార్మికులు తరిమి కొడతారని హెచ్చరించారు. చేనేతకార్మికులకు వెంటనే బతుకమ్మ చీరలు, స్కూల్ బట్టలు ఆర్డర్లు, బకాయిలు ఇవ్వాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఫండ్ తో లాయర్ల ఫీజులు ఇచ్చి హైకోర్టుకి ఈడుస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయసంక్షోభంపై మాట్లాడిన కెసిఆర్ రాష్ట్రంలో నీటినిర్వహణ సామర్థ్యం తెలియని లత్కోరులు, అసమర్థులు, చవట దద్దమ్మలు రాజ్యమేలుతున్నారు అంటూ ఘాటువ్యాఖ్యలు చేశారు.

సీఎం నువ్వా నేనా.. కేసీఆర్ ఫైర్
మోసపూరిత హామీలతో గెలిచారని హామీల అమలు చేయకపోతే లోక్సభ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ను గత గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చిల్లర కుట్రతో వృధాగా 48టీఎంసిల నీటిని వదిలి వేశారని, మండిపడ్డారు కాలేశ్వరం పంప్ హౌస్ నుంచి నీళ్లు వదలాలని కేసీఆర్ ముందే చెప్పవచ్చుగా అంటూ సిగ్గు లేకుండా సీఎం మాట్లాడుతున్నాడని సీఎం నువ్వా నేనా అంటూ ప్రశ్నించారు.

కరువు ప్రకృతి ప్రకోపం వల్ల కాదు
రాష్ట్రంలో ప్రస్తుత కరువు పరిస్థితులు ప్రకృతి ప్రకోపం వల్ల వచ్చినవి కావని.. అసమర్థ పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ సీఎం, బి ఆర్ఎస్ అధినేత కల్వకుంట చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. కొత్తసర్కారు వచ్చిన వందరోజుల్లోనే 200మంది రైతులు ఆత్యహత్య చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కరవు పరిస్థితులతో 15 లక్షల ఎక రాల్లో పంటలు ఎండిపోయాయని.. ఎకరాకు రూ.25 వేల చొప్పున ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

kcr shocking comments on revanth reddy and congress leaders over telangana drought

రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి
తెలంగాణాలో రైతులు మళ్లీ ఆత్మహత్య చేసుకునే దుస్థితి వస్తుందనుకోలేదు. గత ఏడెనిమిదేళ్లు వ్యవసాయ స్థిరీకరణ, రైతు కేంద్రంగా పాలన సాగించాం అన్నారు.. వారికి అనేక పద్ధతుల ద్వారా సాగునీళ్లివ్వడం, సరైన సమయంలో పెట్టుబడి సాయం అందించడం, 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడంతో పాటు పంట ఉత్పత్తుల కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 7,600 కేంద్రాలు ఏర్పాటు చేశాం అన్నారు.

తెలంగాణాకు ఇలాంటి దుస్థితి
నీళ్లిస్తారని నమ్మి పంటలు వేశామని, ఇప్పుడు ప్రభుత్వం కాల్వలకు నీళ్లు వదలకపోవడంతోనే పంటలు ఎండిపోయాయని రైతులు తన పర్యటనలో చెప్పారన్నారు. దేశంలోనే నంబర్ వన్ గా ఉన్న రాష్ట్రంలో ఇంత స్వల్పకాలంలోనే ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలన్నారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదన్నారు . మళ్లీ ట్యాంకర్లు సందడి చేస్తున్నాయన్నారు.బిందెలు పట్టుకొని ఆడబిడ్డలు బయ టకు వచ్చే పరిస్థితి వచ్చిందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+