కెసిఆర్‌పై షబ్బీర్ ఘాటు వ్యాఖ్య, తప్పు చేసి గవర్నర్‌కు ఫిర్యాదా, క్షమాపణ చెప్పు: కిషన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరు నెలలకు ఓసారి సభ జరపాలనే ఉద్దేశ్యంతో నిర్వహించారే తప్ప ప్రజా సమస్యల పైన చర్చించేందుకు కాదని, 10వ తేదీ వరకు అసెంబ్లీ అని ఇప్పుడు తోక ముడిచారని కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ గురువారం ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అధికారులు లేని కమిటీతో ముస్లీం రిజర్వేషన్ల పైన మాట మార్చారని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిధుల్లో 19 శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ అనుకున్నట్లే జరగాలనుకుంటున్నారన్నారు.

ఈ నెల 10వ తేదీ నాటి బంద్‌కు అందరూ సహకరించాలని దానం నాగేందర్ అన్నారు. రైతుల కోసం వ్యాపారులు సహకరించాలన్నారు. ఎల్లుండి బంద్‌కు మద్దతుగా రేపు (శుక్రవారం) చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు ర్యాలీ తీస్తామన్నారు.

 KCR should apologise to farmers: Shabbir Ali and Kishan Reddy

అఖిల పక్ష బందును విజయవంతం చేయాలని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దిక్కుతోచని స్థితిలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో ఉందన్నారు. నెలాఖరులోగా రైతులకు పరిహారం పైన స్పందించాలని డిమాండ్ చేశారు.

కెసిఆర్ క్షమాపణ చెప్పు, ప్రతిపక్షాలపై ఫిర్యాదా: కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీలో సమస్యలపై చర్చించకుండా ప్రతిపక్షాలను సస్పెండ్‌ చేశారన్నారు.

ప్రతిపక్షాలపై గవర్నర్‌కు సీఎం ఫిర్యాదు చేయటం శోచనీయమన్నారు. అధికార పక్షమే తప్పు చేసి ప్రతిపక్షాలపై ఫిర్యాదు చేస్తారా అని ప్రశ్నించారు. ఈనెల 10న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు. బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

ప్రతిపక్షాలవి అలవిగారిన కోరికలు అంటున్న కెసిఆర్... తొలుత తాను రుణమాఫీ చేయనందుకు క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు.

రేపు రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట బిజెపి, టిడిపి ధర్నాకు దిగుతుందన్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో ఆరు లక్షల ఓట్లు తొలగించారన్నారు. మరో ఇరవై లక్షల ఓట్లు తొలగించేందుకు నోటీసులు ఇచ్చారన్నారు. ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేసి సాగర్లో ముంచారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+