Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ షర్మిలపై తొలిసారి విమర్శలు ఎక్కుపెట్టిన కేసీఆర్: ఏమన్నారంటే?

వరంగల్: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై తొలిసారి విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (KCR). మిషన్‌ భగరీథ పథకం గెలవాలా? సుదర్శన్‌రెడ్డి గెలవాలా? వైఎస్‌ షర్మిల డబ్బు కట్టలు గెలవాలా? అని ప్రజలు ఆలోచించాలని కోరారు. నర్సంపేటలో సోమవారం జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ, షర్మిల(YS Sharmila)పై విమర్శలు గుప్పించారు.

'చాలా పెద్ద ప్రమాదం రాబోతున్నది. వ్యవసాయం, రైతులు బాగుండాలని శపథం తీసుకున్నాం. ప్రతిజ్ఞ తీసుకున్నాం. పట్టుబట్టాం. రైతుబంధు భూమండలం మీద ఎక్కడ లేదు. రైతుబంధును పుట్టించిందే కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇది మీ అందరికీ తెలుసు. భారతదేశం తెలంగాణలో నీటి తీరువా లేదు. పాత నీటి తీరువా బకాయిలు రద్దు చేశాం. 24 గంటల ఫ్రీ కరెంటు ఇస్తున్నాం. రైతుబంధు ఇస్తున్నాం. రైతుబీమా అమలు చేస్తున్నాం. రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే రాష్ట్రవ్యాప్తంగా 7500 కొనుగోలు కేంద్రాలను పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. రైతుల అప్పులు పోవాలని, బాధలను పోవాలని ఇవన్నీ చేస్తున్నాం. కాంగ్రెస్‌ నేతలు రైతుబంధు దుబారా అంటున్నారు. మేం రూ.10వేల నుంచి రూ.16వేలకు తీసుకుపోతాం అంటున్నం. మరి ఎవరు గెలవాలి.. ఎవరి వైఖరి ఏంటీ అని ఆలోచన చేయాలి. ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఓటు వేయాలి' అని పిలుపునిచ్చారు.

KCR slams ys sharmila in narsampet brs public meeting

'సుదర్శన్‌రెడ్డి స్థానంలో మరో ఎమ్మెల్యే ఉంటే నర్సంపేటకు మెడికల్‌ కాలేజీ వచ్చేదా? గోదావరి నీళ్లు వచ్చినా.. కాళేశ్వరం నీళ్లతో 270 చెరువులను నింపుకుంటున్నం. గతంలో ఈ ప్రాంతమంతై కొట్లాటలు.. హత్యలు, కల్లోలాలు ఉండే. పదేళ్ల నుంచి నర్సంపేట ప్రశాంతంగా ఉన్నది. సుదర్శన్‌రెడ్డి నాయకత్వంలో పేదల కోసం మంచి పనులు జరుగుతున్నయ్‌. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున సభకు వచ్చుడు కాదు. ఇదే పద్ధతిలో 30వ తారీఖున ఖచ్చితంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి వేయాలి' అని కేసీఆర్ ప్రజలను కోరారు.

'తెలంగాణలో కొనసాగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే.. మళ్లీ పెడదారిన పట్టదంటే.. పేదల సంక్షేమం ఆగవద్దంటే బీఆర్‌ఎస్‌ రావాలి. ఎవడో యాల్లకు వచ్చి ఏం అది చేస్తాం.. ఇది చేస్తాం అంటున్నరు. నర్సంపేటకో ప్రత్యేక ఉన్నది. సమైక్యవాదులు, వాళ్ల చెంచాలు రాజ్యం చేస్తామంటే ఇక్కడ నిరసన తెలిపారు. నిరసన తెలిపారని వైఎస్‌ షర్మిల అనేటామె సుదర్శన్ రెడ్డిపై పగబట్టిందట? డబ్బు కట్టలు పంపిస్తదట? మరి వైఎస్‌ షర్మిల డబ్బు కట్టలు గెలువాలా? మరి మిషన్‌ భగీరథ మంచినీళ్లు గెలవాల్నా.. 24 గంటల కరెంటు గెలవాలా?.. ఎవరు గెలవాలి ఆలోచన చేయాలి. పరాయి రాష్ట్రం వాళ్లు వచ్చి డబ్బు సంచులు పంచి మిమ్మల్ని ఓడిస్తమంటే మనం ఓడిపోదామా? దయచేసి నర్సంపేట ప్రజలు ఆలోచించాలి' అన్నారు కేసీఆర్. మరింత అభివృద్ధి జరగాలంటే ఎన్నికల్లో సుదర్శన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+