చంద్రబాబు పేరు చెప్పి మరీ గొడవలొద్దన్న కేసీఆర్, పొగిడిన గవర్నర్
హైదరాబాద్: ఏపీతో గొడవలు కోరుకోవడం లేదని, విద్వేషాలు వద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు.
ఇరురాష్ట్రాల మధ్య విభేదాలు వద్దన్నారు. చంద్రబాబుకి ఇదే నా వినతి అని వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరిలో 3,858 టీఎంసీల నికర జలాలు అందుబాటులో ఉన్నాయని, ఆ నీళ్లతో నాలుగు కోట్ల ఎకరాలు సాగు చెయ్యొచ్చని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మన వాటా వాడుకోని కోటి ఎకరాలకు సాగునీరు తీసుకుంటామని చెబుతున్నామన్నారు.
తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలి ఏడు నెలల పాటు పాలన సరిగా సాగలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో గవర్నర్ సహకారం మరవలేనిదన్నారు. తెలంగాణ అభివృద్ధి రేటు జాతీయ రేటు కంటే ఎక్కువగా ఉందన్నారు. 2019-20 నాటికి తెలంగాణ బడ్జెట్ రెండు లక్షల కోట్లు దాటుతుందని, 2024 నాటికి 5లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాతో సత్సంబంధాలను కొనసాగిస్తుందన్నారు. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు మంచిదికాదన్నారు. విజ్ఞతతో వ్యవహరించి ఉభయ రాష్ట్రాల రైతులకు లాభం చేకూర్చుకుందామన్నారు. హెచ్‌ఐసీసీలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో గవర్నర్ నరసింహన్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. కృష్ణా నదిలో ప్రతీ ఏడాది 1204 టీఎంసీల నీటి ప్రవాహం ఉంటుందన్నారు. కృష్ణా, గోదావరి కలిపితే 3,858 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటాయని, అన్ని రకాలుగా తెలంగాణ, ఆంధ్రాకు 4,200 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటాయన్నారు.
ముఖ్యమంత్రికి గవర్నర్ కితాబు
సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ విజన్ ఉన్న ముఖ్యమంత్రి అన్నారు. ఎంతో సమర్థవంతంగా పాలన నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రెండేళ్లుగా శాంతిభద్రతల విషయంలో ఢోకాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ఆషామాషీ పథకం కాదన్నారు.












Click it and Unblock the Notifications