ఏప్రిల్ 11 తర్వాత కేసీఆర్ బిజీ... ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఇతర రాష్ట్రాల్లో ప్రచారం..?

హైదరాబాదు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలపై మరింత దృష్టి సారించనున్నారా..? కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్‌కోసం యత్నిస్తున్న గులాబీ బాస్ ఎలాంటి వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పార్టీల అధినేతలను కలిసిన కేసీఆర్... ఎన్నికల తర్వాత మళ్లీ ఎవరిని కలవనున్నారు...? అన్నీ సవ్యంగా సాగితే కేసీఆర్ ఢిల్లీలో కీలకంగా మారుతారా... ?

 కేంద్రంలో చక్రం తిప్పేందుకు కేసీఆర్ రెడీ..?

కేంద్రంలో చక్రం తిప్పేందుకు కేసీఆర్ రెడీ..?

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పురావాలన్న తపనతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. దేశం బాగుండాలంటే బీజేపీ కాంగ్రెస్‌యేతర ప్రభుత్వాలు కేంద్రంలో రావాలని అప్పుడే అభివృద్ధి దిశగా దేశం ముందుకు సాగుతుందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ కేంద్రంలో కీలకంగా మారేందుకు పావులు కదుపుతున్నారు. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది గులాబీ పార్టీ. దీంతో కేసీఆర్ రెట్టించిన ఉత్సాహంతో కేంద్రంలో కూడా తన మార్క్‌ను ప్రదర్శించాలని భావిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే గులాబీ దళపతి పలువురు జాతీయ నాయకులను, ఇతర ప్రాంతీయ పార్టీ నాయకులను కలిశారు. వారికి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు యొక్క అవశ్యకతను వివరించారు.

 ఏప్రిల్ 11 తర్వాత కేసీఆర్ ఎవరెవరిని కలుస్తారు..?

ఏప్రిల్ 11 తర్వాత కేసీఆర్ ఎవరెవరిని కలుస్తారు..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నడుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా తన పార్టీ విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. ఇక ఎన్నికల తర్వాత అంటే ఏప్రిల్ 11న తెలంగాణలో పోలింగ్ ముగిసిన తర్వాత గులాబీ అధినేత పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్‌యేతర ప్రభుత్వం ఏర్పాటు కోసం పావులు కదుపుతున్న కేసీఆర్ ప్రాంతీయ పార్టీ అధినేతలను కలుస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే మరోసారి మూడు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీ నేతలను కేసీఆర్ కలుస్తారనే వార్త ప్రచారంలో ఉంది.

ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా సీఎం కేసీఆర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతితో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులను కేసీఆర్ కలుసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బాబాసాహెబ్ అంబేడ్కర్ మనవడు భరిప బహుజన్ మహాసంఘ్ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ అంబేడ్కర్ తనకు మద్దతు పలుకుతున్నట్లు కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు తెలంగాణలో పోలింగ్ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ నాయకులకు మద్దతుగా వారి రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే అధికారికంగా దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.

ప్రాంతీయ పార్టీల అధినేతలను కేసీఆర్ కన్విన్స్ చేస్తారా..?

ప్రాంతీయ పార్టీల అధినేతలను కేసీఆర్ కన్విన్స్ చేస్తారా..?

ఇక ఇప్పటికే తెలంగాణలో 16 సీట్లను కారు పార్టీ కైవసం చేసుకుంటుందనే విశ్వాసం కేసీఆర్‌లో మెండుగా కనిపిస్తోంది. ఇక ఒక్క సీటు తన మిత్రపక్షం మజ్లిస్ పార్టీ ఎలాగూ గెలుస్తుందనే ధీమాతో కేసీఆర్ ఉన్నారు. ఇక ఏపీలో వైసీపీ 20 సీట్ల వరకు నెగ్గుతుందని కేసీఆర్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీలతో సైద్ధాంతిక విబేధాలు ఉన్న పార్టీల అధినేతలతో కేసీఆర్ భేటీ అవుతారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.అంతేకాదు ఆ పార్టీలను కన్విన్స్ చేసేందుకు కేసీఆర్ వ్యూహాలు కూడా రచిస్తున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. గతేడాది డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాక కేసీఆర్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఒడిషా సీఎం పట్నాయక్, అఖిలేష్ యాదవ్, మాయావతిలను కూడా కలిశారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు కూడా జరిపారు.

ఫెడరల్ ఫ్రంట్ కోసం వ్యూహాన్ని వేగవంతం చేసిన కేసీఆర్

ఫెడరల్ ఫ్రంట్ కోసం వ్యూహాన్ని వేగవంతం చేసిన కేసీఆర్

బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు స్పష్టమైన మెజార్టీ రాదని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన వ్యూహాన్ని వేగంగా అమలు చేసేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రాంతీయ పార్టీ అధినేతలను కలిసి లాబీయింగ్‌ను వేగవంతం చేసే క్రమంలో గులాబీ బాస్ ఉన్నట్లు సమాచారం. ఏపీ ప్రత్యేక హోదా కోసం కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని వైసీపీ అధినేత ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికలు తర్వాత జగన్ తనకే మద్దతు ఇచ్చే అవకాశం ఉందని గులాబీ బాస్ ధీమాతో ఉన్నారు.

మొత్తానికి ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనతో ఉన్న కేసీఆర్ తన కష్టం ఏమేరకు ఫలిస్తుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచిచూడక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+