చేతి కర్ర సాయంతో నడుస్తున్న కేసీఆర్ (వీడియో)

గజ్వేల్: తొంటి ఆపరేషన్ అనంతరం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. చేతికర్ర సాయంతో నడవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్.. వైద్యుల పర్యవేక్షణలో కర్ర సాయంతో నడుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, కేసీఆర్ చేతికర్ర సాయంతో నడుస్తున్న వీడియోను బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. ధృడసంకల్పంతో ప్రతి అడుగుతో కేసీఆర్ బలాన్ని తిరిగి పొందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే సాఫీగా నడిచి అందరి ముందుకు వస్తారని సంతోష్ పేర్కొన్నారు.

KCR Walking in his farm house after discharge from hospital

కేసీఆర్​ వీడియోను చూసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ది ఫైటర్​, గెట్​ వెల్​ సూన్​ సార్​ అంటూ కామెంట్స్​ పెడుతున్నారు. ఆయన గత సంవత్సరం కాలికి దెబ్బ తగలడంతో యశోద ఆస్పత్రిలో ఎడమతుంటి మార్పిడి శస్త్రచికిత్స చేసుకున్నారు. ఈ ఆపరేషన్​ విజయవంతం అయింది.

ఈ క్రమంలో కేసీఆర్‌ను కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు హైదరాబాద్ నివాసం ఉండి.. అనంతరం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా, బుధవారం వైద్యులు తోడు ఉండగా కేసీఆర్ నడవడం మొదలు పెట్టారు. త్వరలోనే ఆయన పూర్తి స్థాయిలో కోలుకుని ప్రజల్లోకి వస్తారని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+