ఎన్డీఏలో చేరేందుకు కేసీఆర్ ఢిల్లీ వచ్చారు, కానీ..: బాంబు పేల్చిన మోడీ
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు బీజేపీని ఆశీర్వదించాలని మోడీ కోరారు. మంగళవారం ఇందూరు గిరిరాజ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ జనగర్జన సభలో ప్రసంగించారు. కొన్ని రోజుల క్రితమే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించుకున్నట్లు గుర్తు చేసిన ప్రధాని మోడీ.. భరతమాత రూపంలో సభకు వచ్చిన చిన్నారులు, మహిళలకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ సంచలన విషయాలు బయటపెట్టిరు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ భారీ సంఖ్యలో స్థానాలు దక్కించుకుందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నిలకు ముందు తనకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చేవారని.. ఆ తర్వాత రాలేదని చెప్పారు. ఎందుకో కూడా ప్రధాని మోడీ తెలిపారు. చాలా కాలం తర్వాత ఆ రహస్యం చెబుతున్నట్లు తెలిపారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందన్నారు ప్రధాని మోడీ. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత కేటీఆర్ ఢిల్లీకి వచ్చి తనను కలిశారు ప్రధాని మోడీ చెప్పారు. తనపై ఎంత ప్రేమగా మాట్లాడారన్నారు. తన నేతృత్వంలో దేశం దూసుకెళ్తోందని కేసీఆర్ చెప్పారన్నారు. అంతప్రేమ కేసీఆర్ ఎప్పుడూ చూపలేదని చెప్పారు మోడీ. అంత ప్రేమ చూపడం కేసీఆర్ వ్యక్తిత్వంలోనే లేదన్నారు.
అంతేగాక, ఈ సందర్భంగా తాము ఎన్డీఏలో చేరతామని కేసీఆర్ తనతో ప్రతిపాదన చేశారని.. అయితే, దాన్ని తాను తిరస్కరించినట్లు ప్రధాని మోడీ చెప్పారు. తాము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోమని చెప్పామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవి దక్కించుకునేందుకు మద్దతు కోరారని తెలిపారు. అయితే, తాను అందుకు ఒప్పుకోలేదని.. తెలంగాణ కోసం బీజేపీ ఒంటరిగానే పోరాటం చేస్తుందని చెప్పిట్లు తెలిపారు.
కేటీఆర్‌కు తన ఆశీర్వాదం కావాలని కేసీఆర్ కోరారని మోడీ తెలిపారు. మీ ఆశీర్వాదం ఉంటే కేటీఆర్‌కు తెలంగాణలో పాలన బాధ్యతలు అప్పగిస్తానని కేసీఆర్ చెప్పారని తెలిపారు. అయితే, కేసీఆర్ ప్రతిపాదనలకు తాను ఒప్పుకోలేదన్నారు. ఇది రాజరికం కాదని.. ప్రజాస్వామ్యం అని కేసీఆర్ కు చెప్పినట్లు తెలిపారు. ప్రజలు ఆశీర్వదించినవారే పాలకులు అవుతారని చెప్పినట్లు వెల్లడించారు. అప్పటి నుంచి తనను కేసీఆర్ కలవలేదని ప్రధాని మోడీ చెప్పారు.
Phenomenal support for the BJP all across Telangana. Speaking at a huge rally in Nizamabad. https://t.co/WNF06cG2lG
— Narendra Modi (@narendramodi) October 3, 2023
వందకు వందశాతం ఇక్కడ నిజం చెప్పడానికే వచ్చానని ప్రధాని మోడీ తెలిపారు. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాం కానీ.. బీఆర్ఎస్ పార్టీతో కలిసేది లేదని చెప్పామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసం బలంగా పోరడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రధాని మోడీ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కాగా, తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు ప్రధాని మోడీ. రాష్ట్రంలో ఆస్పత్రులు, కొత్త రైల్వే లైన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎంతోమంది బలిదానాలతోనే తెలంగాణ కల సాకారమైందన్నారు ప్రధాని మోడీ. రాష్ట్ర ప్రజల సంపదను ఓ కుటుంబం దోచుకుంటోందని కేసీఆర్ పై పరోక్ష విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ కుటుంబ స్వామ్యంగా మార్చిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.












Click it and Unblock the Notifications