ఆయుత చండీ యాగానికి బాబును ఆహ్వానిస్తా: కెసిఆర్, రాష్ట్రపతి, గరవ్నర్ కూడా
హైదరాబాద్: అయుత చండీ యాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడను ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 23 నుంచి 27 వరకు అయుత చండీయాగాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నర్సింహన్, కేంద్రమంత్రులు సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. కాగా, తాను యాగం చేస్తానంటే సురవరం సుధాకర్ రెడ్డి లాంటి నాయకుడు ఆరోపణలు చేయడం బాధ కలిగించిందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.
తాను యాగాలు చేయడం ఇది మొదటి సారికాదని అన్నారు. ప్రజల సుఖశాంతుల కోసం చేసే యాగంపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. తాను యాగం చేస్తానంటే చాలా మంది సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. తాను తన సొంత ఖర్చులతోనే యాగం పూర్తి చేస్తానని తెలిపారు.

ఇది ఇలా ఉండగా, ఇటీవల అమరావతి రాజధాని శంకుస్థాపన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా కేసీఆర్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ ఏపీకి తమ వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్ శంకుస్థాపన కార్యక్రమానికి రావడంపై ప్రధాని మోడీ కూడా ఆయనను అభినందించారు. తాజాగా అయుత చండీయాగానికి చంద్రబాబు హాజరైతే మరోసారి ఇద్దరు చంద్రులను ఒకే వేదికపై మరోసారి చూసే అవకాశం తెలుగు ప్రజలకు కలగనుంది.












Click it and Unblock the Notifications