KCR : నో డౌట్ ..ఈ లెక్కన మరోసారి కేసీఆరే సీఎం..!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పర్వం ముగిసింది. గత 90 రోజులుగా సాగిన ఎన్నికల సందడికి గురువారంతో ముగింపు పలికినట్లు అయింది. ఓటర్లు తమ అమూల్యమైన ఓటును ఈవీఎంల్లో భద్రంగా పొందుపరిచారు. ఎన్నికల తతంగం ముగియక ముందే ఎగ్జిట్ పోల్స్ హంగామా చేశాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని మెజార్టీ సర్వే సంస్థల ఎగ్టిట్ పోల్స్ వెల్లడించాయి. కొన్ని సర్వేలు రాష్ట్రంలో హంగ్ వస్తుందని తెలిపాయి. ఒకటి, రెండు సర్వేలు మాత్రమే అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా సర్వేలు చెప్పడం జరిగింది.

దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా నిరాశలో కురుకుపోయాయి. ఎగ్జిట్ పోల్స్‌పై మాట్లాడిన కేటీఆర్.. కార్యకర్తలు అధైర్యపడవద్దని..మనమే గెలుస్తున్నామని.. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారంటూ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే కేసీఆర్ మరోసారి సీఎం కావాలంటే కొన్ని లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
అధికార బీఆర్ఎస్ పార్టీకి 50 సీట్లు వస్తే మళ్లీ కేసీఆర్ సీఎం అవడం ఖాయం అని ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగుతుంది. 50 సీట్లు తగ్గకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటే..ఎంఐఎం మద్దతుతో అధికారాన్ని చేపట్టవచ్చని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. ఎంఐఎం ఎలాగూ 7 స్థానాల్లో గెలుస్తుంది కాబట్టి.. మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదని ఆ పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు.
బీఆర్ఎస్ 50 సీట్లు గెలిస్తే కాంగ్రెస్, బీజేపీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు తమవైపు వచ్చే అవకాశం ఉందని.. అప్పుడు కచ్చింతంగా కేసీఆరే మరోసారి సీఎం అవుతారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ టార్గెట్ 50 సీట్లుగా మారిపోయింది. మరీ తెలంగాణలో ఏ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుందో తెలియాలంటే మరో రెండు రోజులు వరకు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications